ఉద్యోగి అత్యుత్సాహం.. బయటకు పొక్కిన ‘ఐప్యాడ్ 5’డిజైన్?

Posted By: Prashanth

ఉద్యోగి అత్యుత్సాహం.. బయటకు పొక్కిన ‘ఐప్యాడ్ 5’డిజైన్?

 

యాపిల్ ఐప్యాడ్5కు సంబంధించి ఓ ఆసక్తికర్ వార్త వెబ్ ప్రపంచంలో చక్కర్లు కొడుతోంది. టెక్ టైటాన్ యాపిల్ నుంచి ఈ ఏడాది అందుబాటులోకి రానున్న ఐప్యాడ్5 డిజైన్‌ను ఫాక్స్‌కాన్ సంస్థలకు చెందిన ఓ ఉద్యోగి బహిర్గతం చేసినట్లు ప్రముఖ చైనా వెబ్‌సైట్ ‘మైడ్రైవర్స్’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ సరికొత్త ఐప్యాడ్5 డిజైన్ ఐప్యాడ్ మినీ తరహాలో సన్నని బిజిల్స్ ఇంకా చామ్‌ఫెర్డ్ ఎడ్జ్ కార్నర్‌లను కలిగి ఉండటం విశేషం. సరికొత్త ఐప్యాడ్5ను ‘sapoxx’ కోడ్ నేమ్‌తో పిలుస్తున్నట్లు సదరు వెబ్‌సైట్ పేర్కొంది. ఐప్యాడ్5కు సంబంధించి మునుపటి రిపోర్ట్‌లను పరిశీలిస్తే 7.2 మిల్లీమీటర్లు పలుచటి శ్రేణి శరీరతత్వాన్ని కలిగి ఉంటుంది. సరికొత్త యాపిల్ ఏ6ఎక్స్ ప్రాసెసర్‌ను ఐప్యాడ్5లో వినియోగించినట్లు సదరు రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే, ఐప్యాడ్5 విడుదలకు సంబంధించి భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.

రోడ్డు ప్రింటర్!

ఇటీవల భారత్‌లో విడుదలైన యాపిల్ ఐఫోన్‌5 స్పెసిఫికేషన్‌లు:

4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍‌వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ – హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం).

ఆమె బ్రా నుంచే చార్జింగ్.. ఇంకా మరెన్నో స్పెషల్స్ (గ్యాలరీ)!

ఇతర ఫీచర్లు:

నానో సిమ్‌కార్డ్ సపోర్ట్,

యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్,

సిరీ లాంగ్వేజ్ కమాండ్స్,

ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్,

ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం,

టీవీ అవుట్,

ఐమ్యాప్స్,

ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్,

ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,

ఇమేజ్ ఎడిటర్,

వాయిస్ మెమో.

ఇండియాలో ఐఫోన్5 బ్లాక్ ఇంకా స్లేట్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. ధరలు 16జీబి – రూ.45,500, 32జీబి – రూ.52,500, 64జీబి – 59,500.

Read In Tamil

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot