పేలుడుకు గురైన యాపిల్ కొత్త ఐప్యాడ్

Posted By:

ఆస్ట్రేలియాలోని ప్రముఖ మొబైల్ స్టోర్‌లో యాపిల్ కొత్త ట్యాబ్లెట్ ‘ఐప్యాడ్ ఎయిర్' పేలుడుకు గురైంది. దీంతో ఆ స్టోర్ మొత్తం పొగలు వ్యాపించాయి. వివరాల్లోకి వెళితే కాన్‌బెర్రాలోని వొడాఫోన్ స్టోర్‌లో ఆకస్మాత్తుగా ఐప్యాడ్ ఎయిర్ నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో స్టోర్ మొత్తం పొగలు కమ్మేయటంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక విభాగానికి సమాచారమందించారు. రంగంలోకి దిగిన ఫైర్ ఫైటర్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

పేలుడుకు గురైన యాపిల్ కొత్త ఐప్యాడ్

ఈ ఘటనలో ఏ ఒక్కరూ గాయపడలేదని తెలుస్తోంది. ఇటీవల కాలంలో యాపిల్ ఐఫోన్ పేళుళ్లకు సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఘటన పై వొడాఫోన్ అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ స్టోర్‌లో ప్రదర్శన నిమిత్తం ఉంచిన యాపిల్ కొత్త ఐప్యాడ్ ఛార్జింగ్ పోర్ట్ నుంచి మంటల చెలరేగాయని తెలిపారు. ఘటన పై ఉలిక్కిపడిన యాపిల్ కార్పొరేషన్ పేలుడుకు సంబంధించిన కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. యాపిల్ ఉత్పత్తులను అత్యధికంగా అమెరికా, జపాన్, చైనా ఇంకా కొరియన్ దేశాలకు చెందిన కంపెనీలు తయారు చేస్తున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot