ఇండియాలో నేడే విడుదల: యాపిల్ ఐప్యాడ్ మినీ, ఐప్యాడ్4

Posted By: Super

ఇండియాలో నేడే విడుదల: యాపిల్ ఐప్యాడ్ మినీ, ఐప్యాడ్4

 

యాపిల్ ఉత్పత్తులను అభిమానించే టెక్ ప్రియులకు శుభవార్త. టెక్ టైటాన్ యాపిల్ ఇటీవల ఆవిష్కరించిన  కొత్తతరం టాబ్లెట్  కంప్యూటర్లు  ‘ఐప్యాడ్ మినీ’, ‘ఐప్యాడ్ 4’లు  డిసెంబర్7 అంటే ఈ శుక్రవారం నుంచి దేశీయ ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యంకున్నాయి. ఈ కీలక వివరాలను ‘సాహోలిక్ డాట్ కామ్’అంతర్గత వర్గాలు గిజ్‌బాట్‌కు అందించాయి. ఈ యాపిల్ డివైజ్‌లకు సంబంధించి ధర ఇతర స్సెసిఫికేషన్‌ల వివరాలను పరిశీలిస్తే..

ఐప్యాడ్ మినీ 16జీబి  వై-ఫై వర్షన్ ధర రూ.21,900,

ఇప్యాడ్ మినీ 16జీబి  వై-ఫై+3జీ వర్షన్ ధర రూ.29,900.

ఐప్యాడ్ మినీ ఇతర వేరియంట్‌లకు సంబంధించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. పాత నివేదికలను పరిగణలోకి తీసుకున్నట్లయితే......

ఐప్యాడ్ మినీ 32జీబి వై-ఫై వర్షన్ ధర రూ.27,900.

ఐప్యాడ్ మినీ 32జీబి వై-ఫై+3జీ వర్షన్ ధర రూ.35,900.

ఐప్యాడ్ మినీ 64జీబి వై-ఫై వర్షన్ ధర రూ.33,900.

ఐప్యాడ్ మినీ 64జీబి వై-ఫై+3జీ వర్షన్ ధర రూ.41,900.

(ఈ ధరలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది.)

ఐప్యాడ్ మినీ స్పెసిఫికేషన్‌లు:

7.9 అంగుళాల ఎల్ఈడి బాక్లిట్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, డిస్‌ప్లే రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్, 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్  యాపిల్ ఏ5 ప్రాసెసర్, పవర్ వీఆర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 5 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),  ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం,  ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి/32జీబి/64జీబి, 512ఎంబి ర్యామ్, లైట్నింగ్ పోర్ట్, వై-ఫై, బ్లూటూత్, బ్లూటూత్, 16.3డబ్ల్యూహెచ్ఆర్ లిపో బ్యాటరీ (బ్యాకప్ - 10 గంటలు).

రెటీనా డిస్‌ప్లేతో వివిధ వేరియంట్‌లలో లభ్యంకానున్న ఐప్యాడ్ 4 ధరలను పరిశీలిస్తే........

ఐప్యాడ్4 16జీబి వై-ఫై వర్షన్ ధర రూ.31,900.

ఐప్యాడ్4 16జీబి వై-ఫై+సెల్యులర్ వర్షన్ ధర రూ.39,900.

ఐప్యాడ్4 32జీబి వై-ఫై వర్షన్ ధర రూ.37,900.

ఐప్యాడ్4 32జీబి వై-ఫై+ సెల్యులర్ వర్షన్ ధర రూ.45,900.

ఐప్యాడ్4 64జీబి వై-ఫై వర్షన్ ధర రూ.43,900.

ఐప్యాడ్4  64జీబి వై-ఫై+సెల్యులర్ వర్షన్ ధర రూ.51,900.

ఐప్యాడ్4 స్పెసిఫికేషన్‌లు:

9.7 అంగుళాల ఎల్ఈడి బాక్లిట్ మల్టీటచ్ డిస్‌ప్లే, ఐపీఎస్ టెక్నాలజీ రిసల్యూషన్ 2048 x 1536పిక్సల్స్, రెటీనా డిస్‌ప్లే టెక్నాలజీ, యాపిల్ ఏ6ఎక్స్ ప్రాసెసర్, ఐవోఎస్ 6 ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫేస్‌టైమ్ హైడెఫినిషన్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి/32జీబి/64జీబి, 512ఎంబి ర్యామ్, లైట్నింగ్ పోర్ట్, వై-ఫై, బ్లూటూత్, 42.5డబ్ల్యూహెచ్ఆర్ బ్యాటరీ (బ్యాకప్ - 10గంటలు).

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot