మీడియా గుప్పెట్లో ఆ సీక్రెట్ ఫోటోలు!

Posted By: Staff

మీడియా గుప్పెట్లో ఆ సీక్రెట్ ఫోటోలు!

 

ఆపిల్ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్న కంప్యూటింగ్ డివైజ్ ‘ఐప్యాడ్ మినీ’ పై రూమర్లు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. ఈ డివైజ్ విడిభాగాలకు సంబంధించిన ఫోటో‌గ్రాఫ్‌లను ‘UkraninaniPhone.com’ ఇటీవల విడుదల చేయగా తాజాగా ‘ద వాల్ స్ట్రీట్ జర్నల్ ’ మరో ఆసక్తికర అంశాన్ని వెలుగులోకి తెచ్చింది.

ఐప్యాడ్ మినీకి సంబంధించి పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభమైనట్లు ఈ జర్నల్ వెల్లడించింది. మరో వైపు ప్రముఖ మ్యాగజైన్ ‘fortune’ ఐప్యాడ్ మినీ ఆవిష్కరణ తేదీని ప్రచురిస్తూ ఓ కథనాన్ని పోస్ట్ చేసింది. ఈ ప్రకటనలో పొందుపరిచిన అంశాల ఆధారంగా...  ఐప్యాడ్ మినీని సెప్ట్ంబర్ 17న ఆవిష్కరించనున్నారు. నవంబర్ 2 నుంచి ఈ డివైజ్ మార్కెట్లో లభ్యం కానుంది.

లీకైన ఈ ఫోటో‌గ్రాఫ్‌లను ఆధారంగా చేసుకుని ప్రముఖ టెక్ పోర్టల్ ‘గిజ్ మోడో’ఐప్యాడ్ మినీ ఫీచర్లను విశ్లేషించింది. వాటి వివరాలు....

- ఐప్యాడ్ మినీ 3జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది.

- నానో సిమ్ ట్రేను కలిగి ఉంటుంది.

- వై-ఫై యాంటీనా,

- డాక్ లైటింగ్ కనెక్టర్ (క్రింది భాగంలో),

- స్టీరియో మినీజాక్ ప్లేస్‌మెంట్ (పై భాగంలో),

- ఎల్‌‍టీఈ కనెక్టువిటీ (రూమర్ మాత్రమే),

- 7.2మిల్లీమీటర్ల మందం,

- ధర అంచనా $299 (రూ.16,000).

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot