డిసెంబర్‌లో ఆపిల్ ఐప్యాడ్ మినీ?

Posted By: Staff

డిసెంబర్‌లో ఆపిల్ ఐప్యాడ్ మినీ?

 

టెక్ టైటాన్ ఆపిల్ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన ఐప్యాడ్ మినీ ఇప్పటికే యూకే, యూఎస్ మార్కెట్లలో లభ్యమవుతోంది. ఐప్యాడ్ మినీ  ఇండియా విడుదలకు సంబంధించి ‘బీజీఆర్ ఇండియా’కీలక వివరాలను వెల్లడించింది.  ఈ రిపోర్టులు ఆధారంగా సేకరించన వివరాల మేరకు  16జీబి ఐప్యాడ్ మినీ (వై-పై వర్షన్)  ఇండియన్ మార్కెట్ ధర రూ.21,900గా తెలుస్తోంది. 32జీబి ఇంకా 64జీబి వర్షన్‌‍లకు సంబంధించి ధర వివరాలు తెలియాల్సి ఉంది. మార్కెట్ వర్గాలు వీటి ధరలను రూ. 27,999, రూ. 33,900గా అంచనా వేస్తున్నాయి. దేశీయ మార్కెట్లో క్రిస్టమస్ సీజన్ నాటికి ఐప్యాడ్ మినీని అందుబాటులోకి తెచ్చే అవకాశముందని బీజీఆర్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా, ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఈ-బే.ఇన్ ఐప్యాడ్ మినీ ప్రీఆర్డర్ ధరను రూ.28,990గా  లిస్టింగ్స్‌లో పేర్కొంది.

ఐప్యాడ్ మినీ ఫీచర్లు:

7.9 అంగుళాల ఎల్ఈడి-బ్యాక్లిట్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్, రెటీనా డిస్‌ప్లే, 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ఆపిల్ ఏ5 ప్రాసెసర్, పవర్ వీఆర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 5 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ ర్వహించుకునేందుకు), ఐవోఎస్ 6 ఆపరేటింగ్ సిస్టం, ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ 16జీబి, 32జీబి, 64జీబి, 512ఎంబి ర్యామ్, లైట్నింగ్ పోర్ట్, వై-ఫై,బ్లూటూత్, 16.3 లిపో బ్యాటరీ (10 గంటల బ్యాకప్).

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot