‘ఐప్యాడ్ -2’కు పొంచి ఉన్న ప్రమాదం...?

By Super
|
IPad2 and Amazon Kindle Fire
ఉన్నత ప్రమాణాలతో ప్రపంచ ‘దిగ్గజ బ్రాండ్’గా తన ఉనికిని చాటుకున్న ‘ఆపిల్’కు చెమటలు పడుతున్నాయా..?, ‘ఆమోజోన్ కిండిల్’ రూపంలో దసుకొస్తున్న అగ్ని ‘ఐప్యాడ్-2’ను దహించనుందా..?

మొబైల్ మరియు కంప్యూటింగ్ వ్యవస్థలు టెక్ యుగాన్ని శాసిస్తున్న తరుణంలో విప్లవాత్మక ఒరవడితో ఆవిర్భావమైన టాబ్లెట్ కంప్యూటర్ పరికరాలు క్రమంగా తమ ఉనికిని చాటుతున్నాయి. టాబ్లెట్ పీసీలో మార్కెట్లో తనదైన హవా కొనసాగిస్తున్న ‘ఐప్యాడ్ -2’కు ధీటుగా ‘ఆమోజోన్ కిండిల్ ఫైర్’ రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది.

క్లుప్తంగా వీటి ఫీచర్ల మధ్య వత్యాసాన్ని పరిశీలిద్దాం:

ముందుగా డిస్ ప్లే అంశాలను పరిశీలిస్తే... ‘కిండల్ ఫైర్’ టాబ్లెట్ పీసీ 7 అంగుళాల స్క్రీన్ కలిగి 1024*600 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది. ‘ఐప్యాడ్ 2’ 9.7
అంగుళాల స్క్రీన్ కలిగి 1024*768 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది.

ఆపరేటింగ్ అంశాలను పరిశీలిస్తే..., ‘కిండిల్ ఫైర్’లో ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ వ్యవస్థను లోడ్ చేయ్యగా, ‘ఆపిల్ ఐప్యాడ్ -2’లో iOS ఆపరేటింగ్ వ్యవస్థను పొందుపరిచారు.

బరువు అంశాలను పరిశీలిస్తే..., ‘కిండిల్ ఫైర్’ 414 గ్రాములు, ‘ఐప్యాడ్ -2’ 613 గ్రాముల బరువుతో డిజైన్ కాబడ్డాయి. బ్రౌజర్ అంశాలను పరిశీలిస్తే.., ఆమోజోన్ ‘ఆడ్వాన్సడ్ సిల్క్ బ్రౌజర్’ను వినియోగించగా, ఆపిల్ ‘సఫారీ బ్రౌజర్’ను వినియోగించింది.

ప్రాసెసింగ్ అంశాలను పరిశీలిస్తే.., కిండిల్ ఫైర్ టాబ్లెట్లో డ్యూయల్ కోర్ 1GHz T1 OMAP 4 ప్రాసెసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1GHz ఆపిల్ A5 ప్రాసెసింగ్ వ్యవస్థను ఐప్యాడ్ -2లో ఏర్పాటు చేశారు.

కనెక్టువిటీ అంశాలు రెండు టాబ్లెట్ పీసీలలలో సమాన ప్రాతిపదికను కలిగి ఉంటాయి. కిండిల్ ఫైర్ టాబ్లెట్లో ఏర్పాటు చేసిన జీపీఎస్, బ్లూటూత్ వ్యవస్థలు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి. బ్యాటరీ బ్యాకప్ అంశాలను పరిశీలిస్తే కిండిల్ ఫైర్ 8 గంటలు, ఐప్యాడ్ -2 పది గంటల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ధర అంశాలను పరిశీలిస్తే ‘ఆమోజోన్ కిండిల్ ఫైర్’ మార్కెట్ ధర రూ.9,000 కాగా, ఆపిల్ ఐప్యాడ్ -2 ధర రూ. 22,500.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X