ఇప్పుడు ‘ఐప్యాడె’ హోటెళ్లలో మెనూ కార్డు!!

Posted By: Staff

ఇప్పుడు ‘ఐప్యాడె’ హోటెళ్లలో మెనూ కార్డు!!


సాధారణంగా ల్యాప్‌టాప్, టాబ్లెట్, ఐప్యాడ్ వంటి సాంకేతిక పరికరాలను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల దగ్గరో, కార్పొరేట్ ఉద్యోగుల చేతుల్లోనో చూస్తుంటాం. ట్రెండ్ మారింది.., టెక్ యుగానికి అద్దం పట్టే ‘ఐప్యాడ్’ పరికరాలు రెస్టారెంట్‌లలో మెనూకార్డు అవతారమెత్తాయి.

ముంబైలోని హోటెల్ ‘కొహ్’ ఈ పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఇలా ఐప్యాడ్‌లను మెనూకార్డులుగా ఉపయోగిస్తున్న మొదటి రెస్టారెంటు ఆసియాలో ఇదే.

మెనూకార్డులుగా తీర్చిదిద్దబడిన ఈ ఐప్యాడ్‌లలో రెస్టారెంట్ షెఫ్‌ల ఫోటోలతో పాటు వాళ్లు చేసే వంటకాల వివరాలను పొందుపరిచారు. మనకు నచ్చిన వంటకాన్ని సెలక్ట్ చేసుకుని ఆర్డర్ ఇవ్వచ్చు. చివరిగా ఫీడ్ బ్యాక్ ఇచ్చే సదుపాయం కూడా ఐప్యాడ్‌లలో కల్పించారు.

రాయల్ చైనా రెస్తారెంట్లు సైతం ‘ఐప్యాడ్ల’నే మెనూకార్డులుగా ఉపయోగిస్తున్నాయి. ఈ ఐప్యాడ్లలో వంటకాలు, ధరలకు సంబంధించిన సమాచారమే కాక తాము చెల్లించాల్సిన బిల్లు వివరాలను వినియోగదారులు తెలుసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot