జేబులోనే కాలిపోయిన ఐఫోన్ 6!

Posted By:

యాపిల్ కంపెనీ ఇటీవల ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ల పై గత కొద్ది రోజులుగా విమర్శలు చెలరేగుతూనే ఉన్నాయి. ఐఫోన్ 6ను జేబులో పెట్టుకుంటే కాస్త వొంగుతోందని పలువురు వినియోగదారులు వాపోగా, మరికొందరు మాత్రం ఐఫోన్ 6.. కేసింగ్, ఆల్యూమినియన్ ఫ్రేమ్ మధ్య ఉన్న చిన్న ఖాళీలో తమ జుట్టు ఇరుక్కుంటోందని ఆరోపించారు. ఈ ఫిర్యాదుల పై యాపిల్ కంపెనీ అధికారికంగానే స్పందించింది.

తాజాగా చోటుచేసుకున్న మరో ఉదంతం ఐఫోన్ 6 పై చెలరేగుతున్న విమర్శలకు మరింత ఊతమిచ్చేలా ఉంది. తాజాగా, ఫిలిప్ లెక్టర్ అనే పారిశ్రామికవేత్తకు చెందిన ఐఫోన్ 6 అగ్ని ప్రమాదానికి గురైంది. ఫోన్ అతని జేబులో ఉండగానే ప్రమాదానికి గురైంది. వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వార్తకు సంబంధించి సేకరించిన సమాచారం మేరకు.. ఫిలిప్ లెక్టర్ అనే పారిశ్రామికవేత్త తన కుటుంబంతో టుస్కన్‌లోని ఆరిజోనా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ యాత్రలో భాగంగా టుస్కన్ పట్టణంలో ఫిలిప్ లెక్టర్ కుటుంబం సైకిల్ రిక్షాలో ప్రయాణం చేస్తుండగా, వీరు ప్రయాణిస్తోన్న రిక్షా చక్రం అనుకోకుండా ట్రాలీ ట్రాక్‌ను ఢీ కొట్టింది.

ఈ ఒత్తిడిలో ఫిలిప్ రిక్షాకు ఓ వైపుకు తోసివేయబడ్డారు. ఫలితంగా, ఫిలిప్ ధరించిన జీన్స్ ప్యాంట్ ముందు జేబులో ఉన్న ఐఫోన్ 6 భిన్నమైన కోణంలో గోడకు గుద్దుకుని 90 డిగ్రీలకు పైగా వొంపుకుగురైంది. ఈ క్రమంలో ఫోన్ బ్యాటరీ పై ఒత్తిడి పెరిగి ఆకస్మాత్తుగా మంటల చేలరేగాయి. విషయాన్ని ఆలస్యంగా పసిగట్టిన ఫిలిప్ తన ఫ్యాంట్‌ జేబులో మంటల్లో చిక్కుకున్న ఐఫోన్6ను దూరంగా విసిరేసారు. మంటల్లో చిక్కుకున్న ఐఫోన్ 6 అప్పటికే అతని కాలి పై గాయం చేసింది. వైద్యులు ఈ గాయాన్ని సెకండ్ డిగ్రీగా వర్గీకరించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జేబులోనే కాలిపోయిన ఐఫోన్ 6!

జేబులోనే కాలిపోయిన ఐఫోన్ 6!

ప్రమాదంలో తొడ పై ఏర్పడిన గాయం.

జేబులోనే కాలిపోయిన ఐఫోన్ 6!

జేబులోనే కాలిపోయిన ఐఫోన్ 6!

ప్రమాద తీవ్రతకు వొంపుకు గురైన ఐఫోన్ 6.

జేబులోనే కాలిపోయిన ఐఫోన్ 6!

జేబులోనే కాలిపోయిన ఐఫోన్ 6!

ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన యాపిల్ ఐఫోన్ 6.

జేబులోనే కాలిపోయిన ఐఫోన్ 6!

జేబులోనే కాలిపోయిన ఐఫోన్ 6!

ప్రమాదంలో ధ్వంసమైన ఐఫోన్ 6

జేబులోనే కాలిపోయిన ఐఫోన్ 6!

జేబులోనే కాలిపోయిన ఐఫోన్ 6!

 

జేబులోనే కాలిపోయిన ఐఫోన్ 6!

జేబులోనే కాలిపోయిన ఐఫోన్ 6!

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
iPhone 6 Bent And Caught Fire Inside A Man's Pocket. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot