ఐఫోన్ ప్రమాదం.. మహిళ రొమ్ములో రంధ్రం

Posted By:

ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ పేలుడు ప్రమాదాలకు సంబంధించి తరచూ ఏదో ఒక వార్తను వింటూనే ఉంటున్నాం. తాజాగా స్మార్ట్ ఫోన్ పేలుడు ప్రమాదానికి సంబంధించి మరో విస్మయకర వార్త వెలుగులోకి వచ్చింది. DailyMail  కధనం ప్రకారం...

 ఐఫోన్ ప్రమాదం.. మహిళ రొమ్ములో రంధ్రం

photo courtesy : nick obank

ఎసెక్స్‌కు చెందిన డయోనీ బాక్స్టర్ (25) అనే వివాహిత చార్జింగ్ పెట్టి ఉన్న ఐఫోన్ 4ను తన ఛాతీ పై పెట్టుకుని నిద్రలోకి జారుకుంది. తీవ్రమైన నొప్పితో మరసటి రోజు ఉదయం నిద్రలేచిన బాక్స్టర్ తన ఎడమ రొమ్ము పై 5 అంగుళాల కాలిన గాయాన్ని చూసి నిర్ఘాంతపోయింది. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకోవటంతో వైద్యులు ఆమెకు చికిత్సనందించారు. చార్జింగ్ పెట్టి ఉన్న తన ఐఫోన్ 4 అతిగా వేడెక్కటం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని డయోనీ బాక్స్టర్ సన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/_Ppe6J6aBiI? feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
iPhone burns a hole in a woman's breast. Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot