బీఎస్ఎన్ఎల్‌తో చేతులు కలిపిన విష్‌టెల్!

Posted By: Super

బీఎస్ఎన్ఎల్‌తో చేతులు కలిపిన విష్‌టెల్!

 

 

దేశీయ రంగ గ్యాడ్జెట్ తయారీ సంస్థ విష్‌టెల్, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్‌ల్‌తో జతకట్టి  ‘ఐరా ఐకాన్’ పేరుతో సరికొత్త టాబ్లెట్ పీసీని  బీఎస్ఎన్ఎల్ దినోత్సవం సందర్భంగా సోమవారం ఆవిష్కరించనుంది. యువత, వ్యాపార వర్గాలు అలాగే గృహ అవసరాలకు అనుగుణంగా ఈ డివైజ్‌ను తీర్చిదిద్దినట్లు విష్‌టెల్ సంస్థల చీఫ్ మేనేజింగ్ డైరక్టర్ ఆర్.కే ఉపాధ్యాయ్ అన్నారు. బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక సర్వీసులైన వీడియో స్ట్రీమింగ్, మొబైల్ టీవీ,  బీఎస్ఎన్ఎల్ లైవ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ టాబ్లెట్‌లో ఒదిగి ఉన్నాయి.

ఐరా ఐకాన్ పూర్తిస్థాయి స్పెసిఫికేషన్‌లు:

శరీర కొలత ఇంకా బరువు:  195 x 120 x 12మిల్లీమీటర్లు, బరువు 370 గ్రాములు,

డిస్ ప్లే: 7 అంగుళాల కెపాసిటివ్ మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

ప్రాసెసర్: 1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కెమెరా: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

కనెక్టువిటీ: 3జీ, వై-ఫై, బ్లూటూత్,

బ్యాటరీ: 4000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (బ్యాటరీ బ్యాకప్ 4 నుంచి 5 గంటలు),

ఇతర ఫీచర్లు:

బీఎస్ఎన్ఎల్ 3జీసిమ్, 2జీబి సామర్ధ్యం కలిగిన 3జీ డేటా రెండు నెలల వ్యాలిడిటితో, స్పెషల్ 3జీ డేటా ప్లాన్స్, విష్ లెర్నింగ్, విష్ స్టూడియో, విష్ టీవీ, విష్ న్యూస్, వీష్ వీడియో కాలింగ్.

ధర ఇతర వివరాలు:

దేశీయ మార్కెట్లో ఐరా ఐకాన్ ధర రూ.10,500. విష్‌టెల్ ఇంకా బీఎస్ఎన్ఎల్ స్టోర్‌లలో ఈ గ్యాడ్జెట్ లభ్యమవుతుంది.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot