గుగూల్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి..?

Posted By: Super

గుగూల్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి..?

సెర్చ్ ఇంజన్ గుగూల్ తాజాగా నిర్వహించిన ఐ/వో కాన్ఫిరెన్స్ 2012లో నెక్సస్ 7 టాబ్లెట్‌ను ప్రకటించి మార్కెట్ వర్గాలను ఆకట్టకున్న విషయం తెలిసిందే. అసస్ డిజైన్ చేసిన ఈ గ్యాడ్జెట్ ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. జూలై మధ్య నాటికి ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ వినియోగదారులకు చేరే అకవాశాలు కనిపిస్తున్నాయి.

తాజాగా, గుగూల్ త్వరలో చేపట్టబోయే ఆవిష్కరణకు సంబంధించి కీలక సమాచారం వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది. విశ్వసనీయ వర్గాల సమచారం మేరకు... గుగూల్, నెక్సస్ 10 టాబ్లెట్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని

నెక్సస్ టాబ్లెట్‌లకు డిస్‌ప్లే ప్యానల్స్‌ను సరఫరా చేస్తున్న వింటెక్ సంస్థ నుంచి రాబట్టినట్లు తెలిసింది.

నెక్సస్ 7 టాబ్లెట్ తయారీలో భాగంగా వింటెక్ సంస్థ 50 లక్షల వన్-గ్లాస్ ప్యానల్స్‌ను అందించింది. మిగిలినవి టీపీకే హోల్డింగ్ సంస్థ సప్లై చేసింది. మరో నెక్సస్ టాబ్లెట్ రూపకల్పనలో భాగంగా 10 అంగుళాల ప్యానళ్లను గుగూల్‌కు సరఫరా చేస్తున్నట్లు వింటెక్ సంస్థ బహిర్గతం చేసింది. గుగూల్‌కు 10 అంగుళాల ప్యానళ్లను సమకూర్చే కంపెనీల జాబితాలో ఏయూ ఆప్‌ట్రానిక్స్ ఉన్నట్లు వింటెక్ పేర్కొంది. అనుకున్నవి అనుకున్నట్లే జరిగి గుగూల్ నెక్సస్ 10 ఈ ఏడాది విడుదలైతే ఆమోజన్ కిండిల్ ఫైర్‌కు గట్టి పోటీతప్పదని విశ్లేషక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot