నాన్‌స్టాప్ ‘గేమింగ్ కిక్’...!

Posted By: Super

నాన్‌స్టాప్ ‘గేమింగ్ కిక్’...!

 

కిక్ కోసం పరితపించే గేమింగ్ ప్రేమికులకు ఉత్తేజకర వార్త. ఉత్కంఠతో కూడిన  వినోదభరిత అనుభూతులకు లోను చేసే గేమింగ్ ల్యాప్‌టాప్‌ను ఆరిజన్ సంస్థ డిజైన్ చేసింది. పేరు  ‘EON 11-S’. 11 అంగుళాల స్ర్కీన్ సైజ్‌తో వివిధ కలర్

వేరియంట్‌లలో డిజైన్ కాబడిన ఈ గేమింగ్ ల్యాపీ ఉత్తమమైన పనితీరును ప్రదర్శిస్తుంది.

ల్యాపీ ప్రధాన ఫీచర్లు:

11 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్,

ఐవీ(Ivy) బ్రిడ్జ్ ప్రాసెసర్,

2జీబి సామర్ధ్యం కలిగిన ఎన్-విడియా  ఆడ్వాన్స్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ఆప్టిమస్ గ్రాఫిక్ స్విచ్చింగ్ టెక్నాలజీ,

బ్యాటరీ లైఫ్ 6.5 గంటలు,

ల్యాపీలో నిక్షిప్తం చేసిన ఇంటెల్ మూడవ జనరేషన్ ప్రాసెసర్ గణనీయమైన పనితీరును అందిస్తుంది.  ఏర్పాటు చేసిన ఎన్-విడియా జీఫోర్స్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ల్యాపీలోని  గేమ్‌లను ఉత్తమమైన విజువల్స్‌తో  స్మూత్‌గా రన్ చేస్తుంది. మరో ఫీచర్  DirectX 11 సౌలభ్యతతో  మెరుగైన గ్రాఫిక్ అనుభూతులను యూజర్లు ఆస్వాదిస్తారు. మరో ఫీచర్ THX TruStudio Pro క్రిస్టల్ క్లియర్ ఆడియోను విడుదల చేస్తుంది. డేటాను వేగవంతంగా షేర్ చేసేందుకు వీలుగా ల్యాపీలో బ్లూటూత్ 4.0 వర్షన్‌ను  లోడ్ చేశారు. హెచ్‌డిఎమ్ఐ అవుట్ సాయంతో  డివైజ్‌ను హై డెఫినిషన్ టీవీలకు అనుసంధానం చేసుకోవచ్చు.

బ్యాటరీ సంతృప్తి కరమైన బ్యాకప్‌ను అందిస్తుంది. మ్యాటీ బ్లాక్, గ్లోసీ సిల్వర్, మ్యాటీ రెడ్ కలర్ వేరియంట్‌లలో ఈ గేమింగ్ ల్యాపీలు లభ్యం కానున్నాయి. ధర అంచనా రూ.50,000.  ఉత్తమ స్పెసిఫికేషన్‌లతో సమర్ధవంతంగా డిజైన్ కాబడిన  EON 11-S గేమింగ్ ప్రియులకు ఉత్తమ ఎంపిక.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot