విశ్వరూపం బట్టబయలు..?

గ్యాడ్జెట్ ప్రియులకు సుపరిచితమైన కంప్యూటర్ల తయారీ బ్రాండ్ లెనోవో మరో శక్తివంతమైన ల్యాప్‌టాప్‌ను డిజైన్ చేసింది. పేరు లెనోవో ధింక్ ప్యాడ్ టీ430. ఈ డివైజ్‌కు సంబంధించిన ఫీచర్లు బహిర్గతం కావటంతో లెనోవో యూజర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేగవంతమైన కంప్యూటింగ్ అనుభూతులను చేరువచేసే విధంగా శక్తివంతమైన 22ఎన్ఎమ్ ఐవీ బ్రిడ్జ్ ప్రాసెసర్లను ఈ ల్యాపీలో నిక్షిప్తం చేశారు. ఇతర కీలక ఫీచర్లను పరిశీలిస్తే....
14 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్,
డ్యూయల్ కోర్ ఇంటెల్ కోర్ ఐ5-3210 ప్రాసెసర్,
6జీబి మెమెరీ,
4 ఇన్ 1 కార్డ్ రీడర్,
500జీబి హార్డ్ డ్రైవ్,
హై డెఫినిషన్ వెబ్‌క్యామ్,
6 సెల్ బ్యాటరీ,
1333మెగాహెడ్జ్ డీడీఆర్3 ర్యామ్,
ఐంటెల్ హై డెఫినిషన్ గ్రాఫిక్స్,
హై డెఫినిషన్ కెమెరా,
యూఎస్బీ కనెక్టువిటీ,
హైడెఫినిషన్ మైక్రోఫోన్స్,
వై-ఫై,
జిగాబిట్ ఇతర్ నెట్
లెనోవో థింక్ ప్యాడ్ టీ4320 ఉత్తమమైన డిస్‌ప్లే స్ర్కీన్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో అమర్చిన కెమెరా ఉత్తమ క్వాలిటీతో కూడిన ఫోటోలను చిత్రీకరిస్తుంది. ల్యాపీలో నిక్షిప్తం చేసిన మల్టీ బర్నర్ ఫీచర్ ఆప్టికల్ DVD±RW మన్నికైన పనితీరు ప్రదర్శిస్తుంది. పొందుపరిచిన వెబ్‌క్యామ్‌తో ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ నిర్వహించుకోవచ్చు. జూన్ నాటికి ఈ డివైజ్ అందుబాటులోకి రానుంది. ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








