జపాన్ కంప్యూటర్ ప్రపంచ రికార్డ్...?

By Super
|
సూపర్ కంప్యూటర్ల తయారీలో అగ్రగామి దేశంగా దూసుకుపోతున్న జపాన్ మరో విజయం సాధించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా పనిచేసే కంప్యూటర్‌గా జపాన్‌కు చెందిన కె-కంప్యూటర్ రికార్డు సృష్టించింది. ఫుజిట్సు సంస్థ రూపొందించిన ఈ సూపర్ కంప్యూటర్ సెకనుకు 10 క్వాడ్రిలియన్ (1000000000000000) లెక్కలు కడుతుందని జపాన్ నిపుణులు ప్రకటించారు.

‘కె-కంప్యూటర్’గా పిలవబడే ఈ సూపర్ కంప్యూటర్ సీపీయూలో 88 వేల ప్రాసెసర్ మైక్రో చిప్‌లను పొందుపరిచారు. అంతక పూర్వం ఈ కంప్యూటర్ సెకనుకు 8 క్వాడ్రిలియన్ లెక్కలను మాత్రమే చేసేది.

వెయ్యి ట్రిలియన్లయితే ఒక క్వాడ్రిలియన్. జపాన్ అభివద్ధికి ఈ కంప్యూటర్ సాయపడుతుందని రికెన్ కంపెనీ అధ్యక్షుడు ర్జోజీ నొయోరి వ్యాఖ్యానించారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X