సంవత్సరం వారంటీతో శక్తివంతమైన కీబోర్డ్..రూ.400కే!

Posted By: Staff

సంవత్సరం వారంటీతో శక్తివంతమైన కీబోర్డ్..రూ.400కే!

 

దేశీయంగా ఉత్తమ క్వాలిటీ కంప్యూటింగ్ ఉపకరాణాలను సరఫరా చేసే బ్రాండ్ జిబ్రానిక్స్ (Zebronics) ‘జడ్వా 6’ పేరుతో సరికొత్త కీబోర్డ్ కమ్ మౌస్‌ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో భాగంగా కీబోర్డ్ ప్రత్యేకతలను జిబ్రానిక్స్ వర్గాలు వెల్లడించాయి. పటిష్టమైన హార్డ్‌వేర్ వ్యవస్థతో రూపుదిద్దుకున్న ఈ కీబోర్డ్ పై సంవత్సరం వారంటీని అందిస్తున్నారు. విండోస్ ఆధారిత డెస్క్‌టాప్‌లను ఈ కీబోర్డ్ సహకరిస్తుంది. కీబోర్డులో భాగంగా ఏర్పాటు చేసిన బటన్లు సులువైన టైపింగ్‌కు దోహదపడతాయి. సింగిల్ బటన్ ప్రెస్‌తో మీడియా ప్లేయర్ అదేవిధంగా, ఇంటర్నెట్‌లోకి లాగిన్ అయ్యే ప్రత్యేకతను కల్పించారు. వైర్ వ్యవస్థ ఆధారంగా ఈ కీబోర్డును పీసీకి జత చేసుకోవల్సి ఉంటుంది. ధర రూ.400. జిబ్రానిక్స్ ఆన్‌లైన్ స్టోర్ మనీవసూల్ డాట్ కామ్ వద్ద ఈ కీబోర్డ్ లభ్యమవుతుంది. లింక్ అడ్రస్:

వాటర్ ప్రూఫ్ కీబోర్డ్!

సాధారణంగా కీబోర్డ్ పై నీళ్లు పడితే దాని పనితీరు మందగిస్తుంది. అయితే, ప్రముఖ కంప్యూటర్ విడిభాగాల తయారీ సంస్థ లాగిటెక్ తాజాగా రూపొందించిన వాటర్‌ప్రూఫ్ కీబోర్డ్ నీటిలో ముంచి లేపినా సమర్థవంతంగా పనిచేస్తుంది. దుమ్ము ఇతర బ్యాక్టీరియాల నుంచి దూరంగా ఉంచుకునేందుకు ఎప్పటికప్పుడు ఈ కోబోర్డ్‌ను నీటిలో ఇలా శుభ్రపరుచుకోవచ్చు. ఇందులో నీళ్లు పోవడానికి రంధ్రాలను ఏర్పాటు చేశారు. దీని వల్ల తడి వెంటనే ఆరిపోతుంది కూడా.. లాగిటెక్ కంపెనీ ఈ కొత్త కీబోర్డ్ కు ‘కే310’గా నామకరణం చేసింది. బుధవారం మార్కెట్లోకి విడుదలైన ఈ గ్యాడ్జెట్ ధర రూ.3000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting