పది రోజుల్లో ప్రజల ముందుకు!!

Posted By: Super

పది రోజుల్లో ప్రజల ముందుకు!!

 

కార్బన్ స్వతహాగా డిజైన్ చేసిన తొలి ఆండ్రాయిడ్ టాబ్లెట్ ‘స్మార్ట్ ట్యాబ్ ఏ1’ మరో పది రోజుల్లో మార్కెట్ గడపతొక్కనుంది. ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ పై ఈ పీసీ రన్ అవుతుంది. ప్రచారంలో భాగంగా వినూత్నంగా ముందుకు సాగుతున్న కార్బన్ జరుగుతున్న ఐపీఎల్‌‌లో   ‘కార్బన్ కమాల్ క్యాచ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పోటీలో గెలుపొందిన విజేతలకు ఈ టాబ్లెట్‌లను బహుకరిస్తుంది. ముందస్తు బుకింగ్ ద్వారా ఈ డివైజ్‌ను కొనుగోలు చెయ్యవచ్చు. అత్యుత్తమ టెక్నికల్ స్పెసిఫికేషన్‌లను గ్యాడ్జెట్‌లో నిక్షిప్తం చేశారు.

టాబ్లెట్ ఫీచర్లు:

7 అంగుళాల సమర్థవంతమైన టచ్‌స్ర్కీన్,

ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.2 గిగాహెడ్జ్ ప్రాసెసర్,

మినీ హెచ్‌డిఎమ్ఐ పోర్టు,

మెమరీని పొడిగించుకునేందుకు మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

3జీ యూఎస్బీ డాంగిల్,

యూఎస్బీ కనెక్టువిటీ,

2 మెగా పిక్సల్ కెమెరా,

3డీ గ్రావిటీ సెన్సార్.

ఇప్పటికే మార్కెట్లో లభ్యమవుతున్న మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్, హెచ్‌సీఎల్ మీట్యాబ్‌లకు, కార్బన్ స్మార్ట్ ట్యాబ్ ప్రధాన పోటీదారు కానుంది. ధర ఇతర వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. వినియోగదారుకు అందుబాటైన ధరలోనే ఈ డివైజ్ ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot