కార్బన్ ‘అగ్ని 3జీ’..ఇండియాలో తయారైన మొట్టమొదటి టాబ్లెట్!

Posted By: Prashanth

కార్బన్ ‘అగ్ని 3జీ’..ఇండియాలో తయారైన మొట్టమొదటి టాబ్లెట్!

 

గత కొంత కాలంగా వరస సంఖ్యలో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ దేశీయంగా ఆ విభాగంలో సంచలనం రేకెత్తిస్తున్న ‘కార్బన్’తాజాగా తన దృష్టిని టాబ్లెట్ పీసీల వైపుకు మళ్లించింది. తన అగ్ని సిరీస్ నుంచి తొలి సారిగా భారత దేశంలో తయారుకాబడిన 3జీ టాబ్లెట్‌ను బుధవారం ఆవిష్కరించింది. ఈ ఇండియన్ మోడల్ టాబ్లెట్ 22 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. పీసీలో లోడ్ చేసిన ‘ఐకేర్ కంటెంట్ ప్లాట్‌ఫామ్’ స్కూల్ ఇంకా కళాశాల స్ధాయి విద్యార్ధిని, విద్యార్ధులకు ఎడ్యుకేషన్ సంబంధిత పరిష్కారాలను తీర్చటంలో దోహద పడుతుంది. వివిధ వేరియంట్‌లలో అగ్ని టాబ్లెట్‌లను విడుదల చేస్తామని ఆవిష్కరణ సందర్భంగా కార్బన్ మొబైల్స్ ఎండీ ప్రదీప్ జెయిన్ వెల్లడించారు.

అగ్ని ‘ఎల్’ బేస్ వర్షన్ టాబ్లెట్ ఫీచర్లు:

7 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్,

స్నాప్‌డ్రాగెన్ క్వాల్కమ్ ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరా,

ఐకేర్ కంటెంట్ ప్లాట్‌ఫామ్ (ఈ ఫీచర్ మొత్తం 22 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది),

ఇన్-బుల్ట్ అప్లికేషన్స్ (ఎడ్యుకేషన్, డైరెక్టరీ, న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్.. పెయిడ్ ఇంకా ఫ్రీ వర్షన్స్),

ధర రూ.9,990,

దీపావళి సీజన్ నాటికి ఈ టాబ్లెట్ విడుదలయ్యే అవకాశముంది.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot