కార్బన్ నుంచి తొలి టాబ్లెట్ పీసీ!

Posted By: Super

కార్బన్ నుంచి తొలి టాబ్లెట్ పీసీ!

 

 

మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ కార్బన్, తొలి ట్యాబ్లెట్ పీసీ స్మార్ట్ ట్యాబ్-1ను గురువారం న్యూఢిల్లీలో ఆవిష్కరించింది. గూగుల్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్, 1.2 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్‌తో కూడిన ఈ ట్యాబ్లెట్ ధరను రూ.6,990గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్ ట్యాబ్-1 లో 3జీ డాంగిల్, వైఫైలతో ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేసుకోవచ్చు.

మూడు స్మార్ట్ ఫోన్ లు:

కార్బన్ ఏ9, ఏ7, ఏ5 పేర్లతో మూడు మొబైల్స్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ డివైజ్‌లు 1 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 5 మెగాపిగ్జల్ కెమేరా, వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ కెమెరా తదితర హైఎండ్ స్పెసిఫికేషన్ లు కలిగి ఉన్నాయి. ఈ ఫోన్‌ల ధర శ్రేణి రూ.5,790-9,490. ఈ ఏడాది రూ.2,500 కోట్లు, వచ్చే ఏడాది రూ.3,500 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు కంపెనీ ఎండీ ప్రదీప్ జైన్ చెప్పారు. బ్రాండ్ ప్రచారం, కొత్త ఉత్పత్తుల అభివృద్ధికి సంబంధించి రానున్న రెండేళ్లలో రూ.445 కోట్లను కంపెనీ వెచ్చించనుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot