కార్బన్ తొలి టాబ్లెట్ కంప్యూటర్!

మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ కార్బన్, తొలి ట్యాబ్లెట్ పీసీ స్మార్ట్ ట్యాబ్-1ను గురువారం న్యూఢిల్లీలో ఆవిష్కరించింది. గూగుల్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్, 1.2 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్‌తో కూడిన ఈ ట్యాబ్లెట్ ధరను రూ.6,990గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్ ట్యాబ్-1 లో 3జీ డాంగిల్, వైఫైలతో ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేసుకోవచ్చు. 7 అంగుళాల టచ్ స్క్రీన్‌ను అమర్చారు. వచ్చే జనవరి నాటికి గూగుల్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం జెల్లీ బీన్ ప్లాట్‌ఫామ్ పై పనిచేసే ట్యాబ్లెట్ పీసీని అందుబాటులోకి తేనున్నట్లు కంపెనీ పేర్కొంది.
మూడు స్మార్ట్ ఫోన్ లు:
కార్బన్ ఏ9, ఏ7, ఏ5 పేర్లతో మూడు మొబైల్స్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ డివైజ్‌లు 1 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 5 మెగాపిగ్జల్ కెమేరా, వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ కెమెరా తదితర హైఎండ్ స్పెసిఫికేషన్ లు కలిగి ఉన్నాయి. ఈ ఫోన్‌ల ధర శ్రేణి రూ.5,790-9,490. ఈ ఏడాది రూ.2,500 కోట్లు, వచ్చే ఏడాది రూ.3,500 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు కంపెనీ ఎండీ ప్రదీప్ జైన్ చెప్పారు. బ్రాండ్ ప్రచారం, కొత్త ఉత్పత్తుల అభివృద్ధికి సంబంధించి రానున్న రెండేళ్లలో రూ.445 కోట్లను కంపెనీ వెచ్చించనుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications