లేటెస్ట్ టెక్నాలజీ కంప్యూటర్ రూ.6,990కే!

Posted By: Prashanth

లేటెస్ట్ టెక్నాలజీ కంప్యూటర్ రూ.6,990కే!

 

న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ ఫోన్ మేకర్ ‘కార్బన్’ ప్రపంచ రికార్డ్ దిశగా అడుగులు వేస్తుంది. ఇటీవల కాలంలో టాబ్లెట్ కంప్యూటర్‌ల నిర్మాణంలోకి అడుగుపెట్టిన కార్బన్, ఆండ్రాయిడ్ తాజా ఆపరేటింగ్ సిస్టం, జెల్లీ‌బీన్ ఆధారితంగా స్పందించే ప్రపంచపు తొలి టాబ్లెట్ పీసీ ‘స్మార్ట్ ట్యాబ్ వన్’ను ఈ నెలలోనే ప్రవేశపెట్టనుంది. ఈ సమాచారాన్ని కార్బన్ మొబైల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశిన్ దేవ్‌సరే శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. టాబ్లెట్‌కు సంబంధించి, కాలిఫోర్నియాకు చెందిన ఎంఐపీఎస్ టెక్నాలజీస్ చిప్ డిజైన్ టెక్నాలజీని సమకూర్చగా, చైనాకు చెందిన ఇన్‌జెనిక్ సెమీకండక్టర్ సంస్థ తయారీ సహకారంతో ఈ స్మార్ట్ ట్యాబ్ వన్‌‌ను రూపొందించామని ఆయన తెలిపారు. నెలకు రెండు లక్షల స్మార్ట్ ట్యాబ్ 1ను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కార్బన్ ‘స్మార్ట్ ట్యాబ్ వన్’ కీలక ఫీచర్లు:

తక్కువ శక్తిని ఖర్చు చేసే ప్రాసెసర్: కార్బన్ స్మార్ట్ టాబ్ 1 ప్రధాన ప్రత్యేకత మిప్స్ ఆధారిత JZ4770 సాక్ ప్రాసెసర్. 1.2గిగాహెట్జ్ క్లాక్ వేగాన్ని కలిగిన ఈ ప్రాసెసింగ్ వ్యవస్థ తక్కువ శక్తిని ఖర్చు చెయ్యటంతో పాటు అత్యుత్తమ ప్రాసెసింగ్ వేగాన్ని కలిగి ఉంటుంది.

మన్నికైన బ్యాటరీ లైఫ్: టాబ్లెట్‌లో లోడ్ చేసిన 3700ఎమ్ఏహెచ్ బ్యాటరీ 7 గంటల వెబ్‌బ్రౌజింగ్ టైమ్, 8 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్, 25 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్‌కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.

కెమెరా: టాబ్లెట్ వెనుక భాగంలో నిక్షిప్తం చేసిన 2 మెగా పిక్సల్ కెమెరా ఉత్తమమైన ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది.

ఇతర ఫీచర్లు: యూఎస్బీ డాంగిల్ సౌలభ్యతతో 3జీ సౌలభ్యతను యూజర్ పొందవచ్చు. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు. ఇతర ఫీచర్లైన 5 పాయింట్ మల్టీ టచ్‌స్ర్కీన్, హెచ్‌డిఎమ్ఐ సపోర్ట్, 3డీ జీ-సెన్సార్ వ్యవస్థలు యూజర్‌కు మరింత సంతృప్తికరమైన కంప్యూటింగ్‌ను చేరువచేస్తాయి. ధర రూ.6,990.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot