ఇది విన్నారా..?

Posted By: Prashanth

ఇది విన్నారా..?

 

ప్రముఖ దేశీయ సంస్థ కార్బన్ మొబైల్స్, టెక్ సంస్థ మిప్స్ టెక్నాలజీస్, చైనా ఆధారిత సీపీయూ ప్రొవైడర్ ఇంజినిక్ సెమీకండెక్టర్‌లతో జత కట్టి ప్రపంచపు అతి చవకైన ఆండ్రాయిడ్ జెల్లీబీన్ టాబ్లెట్ ‘కార్బన్ స్మార్ట్ టాబ్ 1’ను త్వరలో ప్రవేశపెట్టనుంది. దీని ధర రూ.6,999. ఆన్‌లైన్ స్టోర్‌లతో పాటు ప్రముఖ అవుట్‌లెట్‌లలో ఈ టాబ్లెట్ లభ్యం కానుంది. జూలై ప్రధమాకంలో విడుదలైన ఆండ్రాయిడ్ 4.1 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ వర్షన్ ‘కార్బన్ స్మార్ట్ టాబ్ 1’కు సైతం జెల్లీబీన్ అప్‌డేట్ వర్తించనుంది.

ఫీచర్లు:

తక్కువ శక్తిని ఖర్చు చేసే ప్రాసెసర్: కార్బన్ స్మార్ట్ టాబ్ 1 ప్రధాన ప్రత్యేకత మిప్స్ ఆధారిత JZ4770 సాక్ ప్రాసెసర్. 1.2గిగాహెట్జ్ క్లాక్ వేగాన్ని కలిగిన ఈ ప్రాసెసింగ్ వ్యవస్థ తక్కువ శక్తిని ఖర్చు చెయ్యటంతో పాటు అత్యుత్తమ ప్రాసెసింగ్ వేగాన్ని కలిగి ఉంటుంది.

మన్నికైన బ్యాటరీ లైఫ్: టాబ్లెట్‌లో లోడ్ చేసిన 3700ఎమ్ఏహెచ్ బ్యాటరీ 7 గంటల వెబ్‌బ్రౌజింగ్ టైమ్, 8 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్, 25 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్‌కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.

కెమెరా: టాబ్లెట్ వెనుక భాగంలో నిక్షిప్తం చేసిన 2 మెగా పిక్సల్ కెమెరా ఉత్తమమైన ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది.

ఇతర ఫీచర్లు: యూఎస్బీ డాంగిల్ సౌలభ్యతతో 3జీ సౌలభ్యతను యూజర్ పొందవచ్చు. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు. ఇతర ఫీచర్లైన 5 పాయింట్ మల్టీ టచ్‌స్ర్కీన్, హెచ్‌డిఎమ్ఐ సపోర్ట్, 3డీ జీ-సెన్సార్ వ్యవస్థలు యూజర్‌కు మరింత సంతృప్తికరమైన కంప్యూటింగ్‌ను చేరువచేస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot