కార్బన్ vs జింక్ (ఏది బెస్ట్..?)

Posted By: Staff

కార్బన్ vs జింక్ (ఏది బెస్ట్..?)

 

దేశీయ ట్యాబ్లెట్ తయారీ బ్రాండ్‌లైన కార్బన్ ఇంకా జింక్‌లు తమ కొత్త ఉత్పత్తులతో మార్కెట్  పోటీని మరింత రసవత్తరం చేశాయి. కార్బన్ తాజాగా స్మార్ట్‌ట్యాబ్ కాస్మిక్ 10 పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ట్యాబ్లెట్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.10,490. మరో వైపు జింక్, జడ్1000 పేరుతో జెల్లీబీన్ ఆప్‌గ్రేడబుల్ ట్యాబ్లెట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ డివైజ్ ధర రూ.10,990. వీటి ఎంపిక పై వినియోగదారుకు అవగాహన కలిగించే క్రమంలో స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా........

పండుగ ఆఫర్లు.. (టాప్-15)!

డిస్‌ప్లే....

కార్బన్ స్మార్ట్‌ట్యాబ్ 10 కాస్మిక్: 9.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్,

జింక్ జడ్1000: 9.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్,

ప్రాసెసర్......

కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 10 కాస్మిక్: 1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

జింక్ జడ్1000:  1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం.....

కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 10 కాస్మిక్: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

జింక్ జడ్1000: ఆండ్రాయిడ్ 4.0 ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్),

స్టోరేజ్....

కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 10 కాస్మిక్: 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, ఇంటర్నల్ మెమరీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జింక్ జడ్1000: 8జీబి ఆన్‌బోర్ట్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కెమెరా....

కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 10 కాస్మిక్: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,

జింక్ జడ్1000: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,

కనెక్టువిటీ....

కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 10 కాస్మిక్:  వై-ఫై, యూఎస్బీ పోర్ట్, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, 3జీ వయా డాంగిల్,

జింక్ జడ్1000: వై-ఫై, జీఎస్ఎమ్ స్లిమ్‌స్లాట్,  2జీ ఇంకా 3జీ సపోర్ట్,  మినీ హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ.......

కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 10 కాస్మిక్: 6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

జింక్ జడ్1000: 7000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర.......

కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 10 కాస్మిక్:  రూ.10,490,

జింక్ జడ్1000: రూ.10,990.

తీర్పు.....

వాయిస్ కాలింగ్ సిమ్ స్లాట్, 2జీ ఇంకా 3జీ ఇంటర్నెట్ కనెక్టువిటీ ఇంకా బ్లూటూత్ ఆప్షన్‌లను కొరుకునే వారికి జింక్ జడ్10000 ఉత్తమ ఎంపిక. ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ అనుభూతులను కోరుకునే వారికి కార్బన్ కాస్మిక్ ఉత్తమ ఎంపిక.

రేపటి తరం కంప్యూటర్లు (ఫోటోలు)

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot