కార్బన్ స్మార్ట్‌ట్యాబ్ 2..(తక్కువ ధర.. బెస్ట్ కంప్యూటింగ్)

Posted By: Prashanth

కార్బన్ స్మార్ట్‌ట్యాబ్ 2..(తక్కువ ధర.. బెస్ట్ కంప్యూటింగ్)

 

సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సమంజసమైన ధరల్లో సాంకేతిక గ్యాడ్జెట్‌లను సమకూరుస్తున్న దేశీయ సంస్థ కార్బన్ ఇప్పటి వరకు వివిధ వేరింయంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్ పీసీలను అందించింది. తాజాగా ఈ సంస్థ కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 2 పేరుతో సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్‌ను ఆవిష్కరించనుంది. గూగుల్ సరికొత్త వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ‘4.1 జెల్లీబీన్’ను ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌లో పొందుపరచనున్నారు.

కీలక స్పెసిఫికేషన్‌లు:

ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం (త్వరలో ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్‌కు అప్ గ్రేడబుల్),

7 అంగుళాల సమర్థవంతమైన 5 పాయింట్ మల్టీ టచ్ డిస్‌ప్లే,

1.2గిగాహెట్జ్ ఎక్స్‌బరస్ట్ ప్రాసెసర్,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సపోర్ట్‌తో మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

2 మెగా పిక్సల్ కెమెరా,

కార్బన్ స్మార్ట్‌గేమ్స్ ఇంకా కార్బన్ బ్రౌజర్,

శక్తివంతమైన 3700ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

వై-ఫై,

బ్లూటూత్,

3జీ వయా డాంగిల్.

కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 2 అధికారికంగా విడుదల కానప్పటికి, ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ ఈ డివైజ్‌ను రూ.6,990కి ఆఫర్ చేస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot