టాబ్లెట్ ఫైట్: కార్బన్ కావాలా..?, క్రోమా కావాలా..?

Posted By: Prashanth

టాబ్లెట్ ఫైట్: కార్బన్ కావాలా..?, క్రోమా కావాలా..?

 

తక్కువ ధర టాబ్లెట్ పీసీల విభాగంలో కార్బన్, క్రోమాల మధ్య పోటీ వాతావరణం నెలకుంది. తాజాగా కార్బన్, స్మార్ట్ ట్యాబ్2 పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లట్ పీసీని విడుదల చేస్తే, క్రోమా ‘సీఆర్ఎక్స్ టీ1075’ మోడళ్లో తక్కువ ధర బడ్జెట్ ఫ్రెండ్లీ జెల్లీబీన్ టాబ్లెట్‌ను ఆవిష్కరించింది. వీటి స్పెసిఫికేషన్‌ల పై వినియోగదారులకు అవగాహన కలిగించే క్రమంలో ఓ తులనాత్మక అంచనా...

బరువు ఇంకా చుట్టుకొలత......

కార్బన్ స్మార్ట్‌ట్యాబ్ 2: వివరాలు తెలియాల్సి ఉంది

క్రోమా సీఆర్ఎక్స్ టీ1075: 194 x 120 x 10.8మిల్లీమీటర్లు, బరువు 295 గ్రాములు,

డిస్‌ప్లే....

కార్బన్ స్మార్ట్‌ట్యాబ్ 2: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),

క్రోమా సీఆర్ఎక్స్ టీ1075: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),

ప్రాసెసర్....

కార్బన్ స్మార్ట్‌ట్యాబ్ 2: 1.2గిగాహెడ్జ్ ఎక్స్‌బరస్ట్ ప్రాసెసర్,

క్రోమా సీఆర్ఎక్స్ టీ1075: 1గిగాహెడ్జ్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం....

కార్బన్ స్మార్ట్‌ట్యాబ్ 2: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం.

క్రోమా సీఆర్ఎక్స్ టీ1075: ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ జెల్లీబీన్),

కెమెరా....

కార్బన్ స్మార్ట్‌ట్యాబ్ 2: 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

క్రోమా సీఆర్ఎక్స్ టీ1075: 2మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్....

కార్బన్ స్మార్ట్‌ట్యాబ్ 2: 4జీబి ఇంటర్నల్ మెమరీ, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

క్రోమా సీఆర్ఎక్స్ టీ1075: 4జీబి ఇంటర్నల్ మెమరీ, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ...

కార్బన్ స్మార్ట్‌ట్యాబ్ 2: వై-ఫై, బ్లూటూత్, 3జీ వయా డాంగిల్,

క్రోమా సీఆర్ఎక్స్ టీ1075: వై-ఫై ఇంకా 3జీ మాత్రమే,

బ్యాటరీ....

కార్బన్ స్మార్ట్‌ట్యాబ్ 2: 3700ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

క్రోమా సీఆర్ఎక్స్ టీ1075: 3000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ధర......

కార్బన్ స్మార్ట్‌ట్యాబ్ 2: రూ.6,999,

క్రోమా సీఆర్ఎక్స్ టీ1075: రూ.5,990,

తీర్పు.....

క్రోమా టాబ్లెట్ లో బ్లూటూత్ ఫీచర్ లోపించినప్పటికి ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ప్లాట్‌ఫామ్ మరిన్ని యూజర్ ఫ్రెండ్లీ అనుభూతులను చేరువ చేస్తుంది. ఎక్కువ కనెక్టువటీ ఫీచర్లతో పాటు మెరుగైన బ్యాటరీ బ్యాకప్ ను కోరుకునే వారికి కార్బన్ స్మార్ట్ ట్యాబ్ సరి అయిన ఎంపిక. తక్కువ ధరతో పాటు జెల్లీబీన్ అనుభూతులను కోరుకునే వారికి క్రోమా సీఆర్ఎక్స్ టీ1075 బెస్ట్ చాయిస్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot