మేం వచ్చేసాం...!

Posted By: Super

మేం వచ్చేసాం...!

 

ఇటీవల కాలంలో కార్బన్ ప్రకటించిన రెండు ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లు  ‘స్మార్ట్ ట్యాబ్ 3 బ్లేడ్’, ‘స్మార్ట్ ట్యాబ్ 9 మార్వెల్’ ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్  ఇన్ఫీబీమ్ తగ్గింపు ధరలతో వీటిని విక్రయిస్తోంది.

కార్బన్ స్మార్ట్ 3 బ్లేడ్...... ఆవిష్కరణ సమయంలో ఈ పీసీ ధర రూ.5,990. ప్రస్తుత  ఆన్‌లైన్ మార్కెట్ ధర రూ.4,990. 7.1 అంగుళాల కెపాసిటివ్ 5 పాయింట్ మల్టీటచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్),  ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1.3 మెగాపిక్సల్ కెమెరా, 1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్, 512ఎంబీ ర్యామ్, 1జీబి ఆన్-బోర్డ్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ, వై-ఫై, 3జీ కనెక్టువిటీ వయా యూఎస్బీ డాంగిల్.

కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 9 మార్వెల్........ ఆవిష్కరణ సమయంలో ఈ డివైజ్ ధర రూ. 7,990. ప్రస్తుత ఆన్‌లైన్ మార్కెట్ ధర రూ.7,111. 9 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,  4000ఎమ్ఏహెచ్  బ్యాటరీ, వై-ఫై, 3జీ కనెక్టువిటీ వయా డాంగిల్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot