కార్బన్ స్మార్ట్‌ట్యాబ్ 3 బ్లేడ్ vs మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ టాక్ (డిష్యుం.. డిష్యుం)!

బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ కంప్యూటర్లకు దేశీయంగా ఆదరణ పెరుగుతోంది. ఆధునిక స్పెసిఫికేషన్‌లను కలిగి అనకూలమైన ధరల్లో లభ్యమవుతున్న ఈ ఆధునిక కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌లకు అన్ని వర్గాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. దేశవాళీ సంస్థలైన మైక్రోమ్యాక్స్ ఇంకా కార్బన్‌లు ఇప్పటికే ఈ విభాగంలో రాణిస్తున్నాయి. మైక్రోమ్యాక్స్ తన ఫన్‌బుక్ లైనప్‌ను మరింత పటిష్టం చేస్తూ ‘ఫన్‌బుక్ టాక్’ పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను ఆవిష్కరించింది. మరో వైపు కార్బన్ తన స్మార్ట్ ట్యాబ్ సిరీస్‌ను బలోపేతం చేస్తూ ‘స్మార్ట్ ట్యాబ్ 3 బ్లేడ్’ మోడల్‌లో తక్కువ ధర ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను ప్రవేశపెట్టింది. మార్కెట్లో ఈ రెండు గ్యాడ్జెట్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీటి ఎంపిక విషయంలో వినియోగదారుకు అవగాహన కలిగించే క్రమంలో ఈ టాబ్లెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా...
బరువు ఇంకా చుట్టుకొలత....
మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ టాక్: 192 X 122 X 10.5మిల్లీమీటర్లు, బరువు 225 గ్రాములు,
కార్మన్ స్మార్ట్‌ట్యాబ్ 3 బ్లేడ్ డ్: వివరాలు తెలియాల్సి ఉంది.
డిస్‌ప్లే...
మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ టాక్: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
కార్మన్ స్మార్ట్‌ట్యాబ్ 3 బ్లేడ్: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
ప్రాసెసర్...
మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ టాక్: 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,
కార్మన్ స్మార్ట్‌ట్యాబ్ 3 బ్లేడ్: 1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం...
మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ టాక్: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
కార్మన్ స్మార్ట్‌ట్యాబ్ 3 బ్లేడ్: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా.....
మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ టాక్: 0.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
కార్మన్ స్మార్ట్‌ట్యాబ్ 3 బ్లేడ్: 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
స్టోరేజ్....
మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ టాక్: 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512 ఎంబీ ర్యామ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
కార్మన్ స్మార్ట్‌ట్యాబ్ 3 బ్లేడ్: 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512 ఎంబీ ర్యామ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
కనెక్టువిటీ.....
మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ టాక్: వై-ఫై 802.11 బి/జి/ఎన్, జీపీఆర్ఎస్, మైక్రోయూఎస్బీ 2.0 పోర్ట్,
కార్మన్ స్మార్ట్‌ట్యాబ్ 3 బ్లేడ్: వై-ఫై 802.11 బి/జి/ఎన్, జీపీఆర్ఎస్, మైక్రోయూఎస్బీ 2.0 పోర్ట్,
బ్యాటరీ....
మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ టాక్: 2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ, (బ్యాకప్ 4 నుంచి 5 గంటలు వై-ఫై ఉపయోగించిన సందర్భంలో),
కార్మన్ స్మార్ట్‌ట్యాబ్ 3 బ్లేడ్: 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ, (బ్యాకప్ 4 నుంచి 5 గంటలు వై-ఫై ఉపయోగించిన సందర్భంలో),
ధర...
మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ టాక్: రూ.7,499,
కార్మన్ స్మార్ట్‌ట్యాబ్ 3 బ్లేడ్ : రూ.5,990,
ప్రధాన ప్రత్యేకతలు:
మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ టాక్: పికాసా, యూట్యూబ్ అప్లికేషన్, డాక్యుమెంట్ వ్యూవర్, మన్నికైన బ్యాటరీ.
కార్మన్ స్మార్ట్‌ట్యాబ్ 3 బ్లేడ్: వేగవంతమైన ప్రాసెసర్, ఉత్తమ క్వాలిటీ కెమెరా, తక్కువ ధర.Read in English


Click it and Unblock the Notifications








