కార్బన్ కొత్త ట్యాబ్లెట్ ‘స్మార్ట్‌ట్యాబ్ వెలాక్స్’

Posted By: Prashanth

కార్బన్ కొత్త ట్యాబ్లెట్ ‘స్మార్ట్‌ట్యాబ్ వెలాక్స్’

 

కొత్త ఆవిష్కరణలతో టెక్ మార్కెట్లో దూసుకుపోతున్న ‘కార్బన్’ మరో నూతన ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. కార్బన్ సరికొత్త ట్యాబ్లెట్ ‘స్మార్ట్‌ట్యాబ్ 8 వెలాక్స్’తాజాగా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. ప్రముక ఆన్‌లైన్ రిటైలర్ ఈబే.ఇన్ ఈ ట్యాబ్లెట్‌ను రూ.6,799కి ఆఫర్ చేస్తున్నట్లు మొబిగ్యాన్ పేర్కొంది. మరో ప్రముఖ ఈ-కామర్స్ సైట్ సాహోలిక్ ‘స్మార్ట్‌ట్యాబ్ 8 వెలాక్స్’ను రూ.7,999కి ఆఫర్ చేస్తోంది. ఈ ట్యాబ్లెట్‌ను అధికారికంగా జనవరి తొలి వారంలో ప్రకటించనున్నట్లు కార్బన్ వర్గాలు పేర్కొన్నాయి.

భలే భలే మెమరీ కార్డ్ రీడర్లు (ఫోటో గ్యాలరీ)!

స్పెసిఫికేషన్‌లు:

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

8 అంగుళాల కెపాసిటివ్ టచ్ డిస్‌ప్లే,

రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్,

1.5గిగాహెట్జ్ డ్యూయల్-కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,

1జీబి ర్యామ్, 1.51జీబి ఇంటర్నల్ మెమరీ,

32జీబి ఎక్ప్ ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,

3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

జీ-సెన్సార్, వై-పై, బ్లూటూత్, హెచ్‌డిఎమ్ఐ, యూఎస్బీ పోర్ట్ సపోర్ట్,

3జీ డేటా కనెక్టువిటీ,

4500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (7 గంటల ఇంటర్నెట్ బ్రౌజింగ్ టైమ్, 8 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్, 25 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్).

మరో ట్యాబ్లెట్ కార్బన్ కాస్మిక్ స్పెసిఫికేషన్‌లు.....

ప్రముఖ దేశవాళీ మొబైల్ తయారీ సంస్థ కార్బన్ మొబైల్స్ ‘స్మార్ట్‌ట్యాబ్ 10 కాస్మిక్’ పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ట్యాబ్లట్‌ను వృద్థి చేసింది. ఈ గాడ్జెట్ అధికారిక విడుదల ఖరారు కాలేదు. అయితే, ఈ 10 అంగుళాల శ్రేణి కంప్యూటింగ్ డివైజ్‌కు సంబంధించి పలు కీలక స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం……

- 9.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్),

- 1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

- 1జీబి ర్యామ్,

- మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

- ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

- 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

- వై-ఫై, యూఎస్బీ పోర్ట్, హెచ్ డిఎమ్ఐ పోర్ట్, 3జీ వయా డాంగిల్,

- 6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot