కార్బన్ vs స్వైప్ (ట్యాబ్లెట్ ఫైట్)

Posted By: Staff

కార్బన్   vs స్వైప్ (ట్యాబ్లెట్ ఫైట్)

 

స్మార్ట్ కంప్యూటింగ్‌కు ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో ట్యాబ్లెట్ పీసీలకు డిమాండ్ పెరుగుతోంది. ట్యాబ్లెట్ పీసీల విభాగంలో ఆండ్రాయిడ్ హవాకు చెక్ పెట్టేందుకు యాపిల్ 8 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో  ఐప్యాడ్ మినీ ట్యాబ్లెట్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 8 అంగుళాల శ్రేణి

ట్యాబ్లెట్ కంప్యూటింగ్ వ్యాపారంలో తమ సత్తాను చాటుకునే క్రమంలో స్వైప్ టెలికామ్ అలానే కార్బన్ మొబైల్స్ రెండు సరికొత్త జెల్లీబీన్ ట్యాబ్లెట్‌లను ఆవిష్కరించాయి. కార్బన్ ‘వెలాక్స్ ట్యాబ్’, స్వైప్ ‘వెలాసిటీ ట్యాబ్’ మోడళ్లలో లభ్యంకానున్న ఈ సొగసరి కంప్యూటింగ్ గాడ్జెట్‌ల స్సెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా.......

బెస్ట్ ల్యాప్‌టాప్స్ (2012)!

బరువు ఇంకా చుట్టుకొలత......

కార్బన్ వెలాక్స్ ట్యాబ్8: తెలియాల్సి ఉంది,

స్వైప్ వెలాసిటీ ట్యాబ్:   209 x 163 x 0.5మిల్లీ మీటర్లు, బరువు 330 గ్రాములు,

డిస్‌ప్లే.......

కార్బన్ వెలాక్స్ ట్యాబ్8: 8 అంగళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్),

స్వైప్ వెలాసిటీ ట్యాబ్:   8 అంగళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్), ఐపీఎస్ ప్యానల్, 5 పాయింట్ మల్టీటచ్ సపోర్ట్,

ప్రాసెసర్......

కార్బన్ వెలాక్స్ ట్యాబ్8: 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్  ప్రాసెసర్,

స్వైప్ వెలాసిటీ ట్యాబ్:  కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్ (క్లాక్ వేగం తెలియాల్సి ఉంది),

ఆపరేటింగ్ సిస్టం......

కార్బన్ వెలాక్స్ ట్యాబ్8: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: ప్రాజెక్ట్ బట్టర్, కాంట్రిక్టబుల్ నోటిఫికేషన్స్, రీసైజబుల్ అప్లికేషన్ విడ్జెట్స్, లైవ్ వాల్ పేపర్ ప్రివ్యూ, హై రిసల్యూషన్ కాంటాక్ట్ ఫోటోలు, మెరుగపరచబడిన ఆండ్రాయిడ్ బీమ్ అప్లికేషన్),

స్వైప్ వెలాసిటీ ట్యాబ్: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: ప్రాజెక్ట్ బట్టర్, కాంట్రిక్టబుల్ నోటిఫికేషన్స్, రీసైజబుల్ అప్లికేషన్ విడ్జెట్స్, లైవ్ వాల్ పేపర్ ప్రివ్యూ, హై రిసల్యూషన్ కాంటాక్ట్ ఫోటోలు, మెరుగపరచబడిన ఆండ్రాయిడ్ బీమ్ అప్లికేషన్),

స్టోరేజ్......

కార్బన్ వెలాక్స్ ట్యాబ్8: 1.5జీబి ఇన్-బుల్ట్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

స్వైప్ వెలాసిటీ ట్యాబ్: 1జీబి ర్యామ్, 8జీబి ఆన్‌బోర్ట్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ......

కార్బన్ వెలాక్స్ ట్యాబ్8: వై-ఫై, 3జీ వయా డాంగిల్, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, బ్లూటూత్,

స్వైప్ వెలాసిటీ ట్యాబ్:  వై-ఫై, 3జీ వయా డాంగిల్, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, బ్లూటూత్,

బ్యాటరీ.....

కార్బన్ వెలాక్స్ ట్యాబ్8: 4,500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

స్వైప్ వెలాసిటీ ట్యాబ్:  4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర....

కార్బన్ వెలాక్స్ ట్యాబ్8: రూ.7,025.

స్వైప్ వెలాసిటీ ట్యాబ్:  రూ.11,490.

తీర్పు...

తక్కువ ధర, వేగవంతమైన ప్రాసెసర్, బ్లూటూత్ కనెక్టువిటీ ఆప్షన్‌లను కోరుకునే వారికి కార్బన్ వెలాక్స్ ట్యాబ్8 ఉత్తమ ఎంపిక. మెరుగైన డిస్‌ప్లే, ఫ్రంట్ కెమెరా, పటష్టమైన ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లను కోరుకునే వారికి స్వైప్ వెలాసిటీ ట్యాబ్ బెస్ట్ చాయిస్.

హైక్లాస్ స్మార్ట్‌ఫోన్‌లు (2012)

Read in English

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot