ప్రయాణంలో మీ ల్యాప్‌టాప్‌కు భద్రత ఎంత..?

Posted By:

ప్రయాణంలో మీ ల్యాప్‌టాప్ సురక్షితంగా ఉంటోందా..?, మీరు కల్పిస్తున్న భద్రత ఎంత..? ప్రయాణ సమయంలో మీ వెంట ల్యాప్‌టాప్‌ను తీసుకువెళ్లాల్సి వస్తే పాటించవల్సిన పలు జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం...

 ప్రయాణంలో మీ ల్యాప్‌టాప్‌కు భద్రత ఎంత..?

ల్యాపీని మోసుకెళ్లే బ్యాగ్ నాణ్యమైన ఇంకా పటిష్టమైన రక్షణ వ్యవస్థను కలిగి ఉండాలి:

చాలా మంది ప్రయాణ సమయాల్లో తమ ల్యాప్‌టాప్‌లను సాధారణ బ్యాక్‌ప్యాక్ ఇంకా పుస్తకాల బ్యాగ్‌లలో మోసుకువెళుతుంటారు. ఈ విధానం ఏమాత్రం సురిక్షితం కాదు. ల్యాప్‌టాప్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన బ్యాగ్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎంపిక చేసుకోవటం ద్వారా ప్రయాణంలో మీ ల్యాపీ ఒత్తిడికి గురికాకుండా ఉంటుంది.

ప్రయాణంలో ఆఫ్ చేసి ఉంచండి:

ప్రయాణ సమయాల్లో ల్యాప్‌‌టాప్ పవర్‌ను పూర్తిగా ఆఫ్‌చేసి ఉంచటం మంచిది. జర్నీ సమయంలో ల్యాపీని ఎక్కువ సేపు వినియోగంచటం కారణంగా కుదుపుకు గురయ్యే అవకాశముంది. దీంతో ల్యాపీలోని కాంపోనెంట్లు దెబ్బ తింటాయి. ప్రయాణ సమయంలో ల్యాపీని చల్లటి వాతావరణంలో ఉంచటం మంచింది.

ఓ కన్నేసి ఉంచండి:

ప్రయాణ సందర్భాల్లో మీ ల్యాప్‌టాప్‌కు మరింత భద్రత అవసరాం. కాబట్టి, ఎటువంటి నిర్లక్ష్యం వద్దు. ఇటీవల కాలంలో రైళ్లు, బుస్సులలో ల్యాప్‌టాప్ దొంగతనాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి, ప్రయాణం సమయంలో ల్యాప్‌టాప్ రక్షణ పట్ల మరింత అప్రమత్తత అవసరం.

పబ్లిక్‌లో ఉన్నారన్న విషాయన్ని మర్చిపోవద్దు:

పబ్లిక్ ప్రాంతాల్లో వై-ఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించే ముందు కాస్త ఆలోచించండి. మీ ల్యాపీలోకి వైరస్‌లను ప్రవేశపెట్టి డేటాను దొంగిలించేందుకు హ్యాకర్లకు ఇదో మంచి మార్గం. ఇటువంటి సమస్యలను ఎదుర్కొవాలంటే మీ ల్యాప్‌టాప్‌లో సురక్షితమైన యాంటీ స్పైవేర్ వ్యవస్థను అప్ టూ డేట్‌గా లోడై ఉండాలి.

మీ ల్యాప్‌టాప్‌కు సమంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని ముందుగా నోట్ చేసుకోండి:

మీ ల్యాప్‌టాప్ మోడల్, సీరియల్ నెంబర్, సర్వీస్ నెంబర్, స్పెసిఫికేషన్స్ వంటి అంశాలను లిఖిత పూర్వకంగా రాసి ఉంచుకోవటం మంచింది. అనుకోని పరిస్థితులలో ల్యాపీ చోరికి గురైనట్లయితే ఈ సమాచారంతో వెతికిపట్టుకునే అవకాశం ఉంటుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot