విద్యార్థులపైనే గురి..?

Posted By: Prashanth

విద్యార్థులపైనే గురి..?

 

మార్కెట్లో లభ్యమవుతున్న బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ టాబ్లెట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మైక్రోమ్యాక్స్, కార్బన్ వంటి ప్రముఖ కంపెనీలు మొదలుకుని బీఎస్‌ఎన్‌ఎల్ వంటి దిగ్గజ టెలికాం ఆపరేటర్ల వరకు టాబ్లెట్ కంప్యూటర్లను లాంచ్ చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరొకటి వచ్చి చేరబోతోంది. పేరు క్లౌడ్‌ప్యాడ్ (KloudPad).త్రివేండ్రంలో ఈ డివైజ్‌ను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్ధులకు అవసరమైన అనేక అంశాలను ఈ పరికరంలో నిక్షిప్తం చేశారు. CBSE & ICSE కోర్సులకు సంబంధించిన సమాచారాన్ని ఈ డివైజ్‌లో ముందుగానే ఇన్‌బుల్ట్ చేశారు. ఈ ఫీచర్ విద్యార్థులకు మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది. టాబ్లెట్‌లో కాలింగ్ నిర్వహించేకునేందుకు వీలుగా ‘3జీ’స్లిమ్ స్లాట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సౌలభ్యతతో 3జీ వేగంతో కూడిన మొబైలింగ్ నిర్వహించుకోవచ్చు.

ఇతర ఫీచర్లు:

- 7 అంగుళాల టచ్‌స్ర్కీన్ రిసల్యూషన్ ( 800 x 480పిక్సల్స్) ,

- కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్ (ప్రాసెసింగ్ వేగం 1.2గిగాహెడ్జ్),

- ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

- 4జీబి ఇంటర్నల్ మెమెరీ,

- 512ఎంబీ ర్యామ్,

- ఎక్సటర్నల్ స్టోరేజ్ 32జీబి,

- క్వాలిటీ ఫ్రంట్ కెమెరా,

- వై-ఫై కనెక్టువిటీ,

- హెచ్‌డిఎమ్ఐ అవుట్,

- యూఎస్బీ సపోర్ట్,

- 6 గంటల బ్యాకప్ నిచ్చే 4000 mAH బ్యాటరీ.

ఇవే కాకుండా మరిన్నిఅదనపు సౌలభ్యతలను వినియోగదారులు ఆస్వాదించవచ్చు. మెడికిల్, ఇంజనీరింగ్ విద్యార్థులకు అవసరమైన శాంపిల్ టెస్ట్ పేపర్లను Attano సౌజన్యంతో క్లౌడ్ ప్యాడ్ అందిస్తుంది. నిక్షిప్తం చేసిన Edu TV, Attano ఈ-బుక్ అప్లికేషన్‌లు యూజర్‌కు మరింత ఉఫయుక్తంగా నిలుస్తాయి. ధర అంచనా రూ.9,999. ఔత్సాహికులు slatestore.in ద్వారా ఈ డివైజ్‌ను కోనుగోలు చెయ్యవచ్చని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot