వావ్... 4,000లకే కంప్యూటర్!!

By Prashanth
|
Kobian


మెర్క్యురీ బ్రాండ్ క్రింద టాబ్లెట్ కంప్యూటర్లను డిజైన్ చేసే సంస్ద కోబియన్ సరికొత్త టాబ్లెట్ పీసీని డిజైన్ చేసింది. పేరు iXA Tab.మే 23 నుంచి ఈ డివైజ్ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఆకాష్ టాబ్లెట్‌కు పోటీగా వస్తున్న iXA Tab ధర రూ.3,999. గ్యాడ్జెట్ వారంటీకి సంబంధించి ఏ విధమైన సమాచారం లేదు.

ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగహెడ్జ్ ప్రాసెసర్,

512ఎంబీ ర్యామ్,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమెరీ 32జీబికి పొడిగించుకోవచ్చు.

మార్కెట్లో లభ్యమవుతున్న ఆకాష్, యూబీస్లేట్, బీఎస్ఎన్ఎల్ టాబ్లెట్‌లకు ధీటుగా iXA Tabను రూపొందించినట్లు సమాచారం. ఈ అంశం కోబియన్ ఇండియా మేనేజర్ సుష్మితా దాస్ స్పందిస్తూ ప్రత్యేకించి విద్యార్థుల కోసం ఈ పీసీని డిజైన్ చేసినట్లు తెలిపారు.

మెర్క్యురీ ‘mTab2’:

మెర్క్యురీ ‘mTab’కు అప్‌డేటెడ్ వర్షన్‌గా ‘mTab2’ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. సంవత్సరం వారంటీతో రూ.12,000లకే లభ్యమవున్న ఈ టాబ్లెట్ ఉత్తేజకరమైన లక్షణాలను ఒదిగి ఉంది. అవేంటో మీరు ఓ లుక్ వేయండి… యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ వోఎస్ ఈ టాబ్లెట్ రన్ అవుతుంది. లోడ్ చేసిన్ డ్యూయల్ కోర్ 1 GHz ప్రాసెసర్ డివైజ్ పని సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తుంది. 7 అంగుళాల మల్టీ టచ్ డిస్‌ప్లే క్లారిటీతో కూడిన విజువల్ అనుభూతిని కలిగిస్తుంది. డివైజ్ ఇంటర్నల్ స్టోరేజ్ 8జీబి.. ముఖ్యమైన డేటాను స్టోర్ చేసుకునేందుకు తోడ్పడుతుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా జీబిని 32కు పెంచుకోవచ్చు. ఏర్పాటు చేసిన ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా లైవ్ వీడియో ఛాటింగ్‌కు తోడ్పడుతుంది. బ్యాటరీ బ్యాకప్ 8 గంటలు. టాబ్లెట్‌ను హైడెఫినిషన్ టీవీలకు జత చేసుకునే విధంగా హెచ్డీఎమ్ఐ పోర్ట్‌ను టాబ్లెట్‌లో అమర్చారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X