కోబియన్ vs వికెడ్‌లీక్ (తక్కువ ధర టాబ్లెట్ పీసీల వార్)!

Posted By: Prashanth

కోబియన్ vs వికెడ్‌లీక్ (తక్కువ ధర టాబ్లెట్ పీసీల వార్)!

 

కంప్యూటర్ పరికరాల తయారీ సంస్ధ కోబియన్ సోమవారం ‘మెర్క్యరీ ఎమ్ ట్యాబ్7’ పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. అత్యంత పలచటి స్వభావాన్ని కలిగిన ఈ కంప్యూటింగ్ డివైజ్ ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. బరువు కూడా తక్కువే. మరో వైపు వికెడ్ లీక్ సంస్థ వామ్మి డిజైర్ పేరుతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను ఆవిష్కరించింది. డివైజ్ ఆండ్రాయిడ్ లేటెస్డ్ వర్షన్ వోఎస్ 4.1జెల్లీబీన్ పై రన్ అవుతుంది. ఈ నేపధ్యంలో రెండు గ్యాడ్జెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై విశ్లేషణ.......

బరువు ఇంకా చుట్టుకొలత:

వికెడ్‌లీక్ వామ్మి డిజైర్: వివరాలు తెలియాల్సి ఉంది.

కోబియన్ మెర్క్యురీ ఎమ్ ట్యాబ్ 7: 193 x 117 x 14మిల్లీమీటర్లు, బరువు 400 గ్రాములు,

డిస్‌ప్లే:

వికెడ్‌లీక్ వామ్మి డిజైర్: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

కోబియన్ మెర్క్యురీ ఎమ్ ట్యాబ్ 7: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

ప్రాసెసర్:

వికెడ్‌లీక్ వామ్మి డిజైర్: 1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,

కోబియన్ మెర్క్యురీ ఎమ్ ట్యాబ్ 7: 1.2గిగాహెడ్జ్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం:

వికెడ్‌లీక్ వామ్మి డిజైర్: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

కోబియన్ మెర్క్యురీ ఎమ్ ట్యాబ్ 7: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా:

వికెడ్‌లీక్ వామ్మి డిజైర్: 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, రేర్ కెమెరా వ్యవస్థ లోపించింది.

కోబియన్ మెర్క్యురీ ఎమ్ ట్యాబ్ 7: 0.3 మెగా పిక్సల్ ఫ్ఱంట్ కెమెరా, రేర్ కెమెరా వ్యవస్థ లోపించింది.

స్టోరేజ్:

వికెడ్‌లీక్ వామ్మి డిజైర్: 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కోబియన్ మెర్క్యురీ ఎమ్ ట్యాబ్ 7: 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ:

వికెడ్‌లీక్ వామ్మి డిజైర్: వై-ఫై 802.11 బి/జి/ఎన్, 3జీ వయా డాంగిల్, మైక్రోయూఎస్బీ 2.0 కనెక్టువిటీ,

కోబియన్ మెర్క్యురీ ఎమ్ ట్యాబ్ 7: వై-ఫై 802.11 బి/జి/ఎన్, 3జీ వయా డాంగిల్, మైక్రోయూఎస్బీ 2.0 కనెక్టువిటీ,

బ్యాటరీ:

వికెడ్‌లీక్ వామ్మి డిజైర్: 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (6 గంటల బ్యాకప్),

కోబియన్ మెర్క్యురీ ఎమ్ ట్యాబ్ 7: బ్యాకప్ (5 నుంచి 6 గంటలు),

ధర:

వికెడ్‌లీక్ వామ్మి డిజైర్: రూ.6,499.

కోబియన్ మెర్క్యురీ ఎమ్ ట్యాబ్ 7: రూ.6.499.

ప్రీలోడెడ్ ఫీచర్లు:

వికెడ్‌లీక్ వామ్మి డిజైర్: ఆడోబ్ ఫ్లాష్ 11.ఎక్స్, వర్డ్, ఎక్సీల్, పవర్ పాయింట్, పీడీఎఫ్ డాక్యుమెంట్స్, 3డి గేమ్స్,

కోబియన్ మెర్క్యురీ ఎమ్ ట్యాబ్ 7: ఆడోబ్ ఫ్లాష్ 11.1, బుల్ట్‌ఇన్ స్పీకర్,

తీర్పు:

ఆండ్రాయిడ్ ఐసీఎస్ అదేవిధంగా మల్టీ‌టచ్ కంట్రోలింగ్ అనుభూతులను పొందాలనుకునే వారికి మెర్క్యురీ ఎమ్ ట్యాబ్ ఉత్తమ ఎంపిక. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ అదేవిధంగా వేగవంతమైన ప్రాసెసర్, పటిష్టమైన ఇంటర్నల్ స్టోరేజ్ వ్యవస్థను కోరుకునే వారికి వామ్మి డిజైర్ బెస్ట్ చాయిస్.

Read In English

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot