కోబియన్ సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్ ‘మెర్క్యురీ ఎంట్యాబ్7’

Posted By: Prashanth

కోబియన్ సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్ ‘మెర్క్యురీ ఎంట్యాబ్7’

 

మెర్క్యురీ బ్రాండ్ కింద టాబ్లెట్ కంప్యూటర్‌లను విడదల చేసే కోబియన్ తాజాగా ‘మెర్క్యురీ ఎంట్యాబ్7’పేరుతో సరికొత్త టాబ్లెట్ పీసీని మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.6,499. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా కోబియన్ సంస్థల మేనేజర్ సుష్మితా దాస్ స్పందిస్తూ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్ రిచ్ టాబ్లెట్ పీసీలకు మార్కెట్లో ఆదరణ నెలకున్న నేపధ్యంలో రూ.7,000ధరలో, ఎంట్యాబ్7ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. తక్కువ బరువు స్లీక్ డిజైనింగ్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం అదేవిధంగా ప్రీలోడెడ్ అప్లికేషన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయని ఆమె తెలిపారు. ఎంట్యాబ్7 కీలక స్పెసిఫికేషన్‌లు:

డిస్‌ప్లే: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

ప్రాసెసర్: 1.2గిగాహెడ్జ్ సింగిల్‌కోర్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కెమెరా: 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

కనెక్టువిటీ: 3జీ వయా డాంగిల్, వై-ఫై 802.11 a/b/g/n, హెచ్‌డిఎడ్ఐ పోర్ట్, మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ: వివరాలు తెలియాల్సి ఉంది.

ఇతర ఫీచర్లు: ఆడోబ్ ఫ్లాష్ 11.1, బుల్ట్‌ఇన్ స్పీకర్ (హైడెఫినిషన్ మ్యూజిక్‌ను అందిస్తుంది),

ధర ఇతర వివరాలు: దేశీయ మార్కెట్లో మెర్క్యురీ ఎంట్యాబ్7 ధర రూ.6,499. ఒక సంవత్సరం వారంటీతో.....

కోబియన్ మెర్క్యురీ ఎంట్యాబ్7కు పోటీదారుగా భావిస్తున్న ‘వికెడ్ లీక్ వామ్మి డిజైర్ ’ ఫీచర్లు:

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

7 అంగుళాల కెపాసిటివ్ 5 పాయింట్ టచ్‌స్ర్కీన్,

డ్యూయల్ కోర్ 1.5గిగాహెడ్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్.

400 మాలీ కోర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

1జీబి డీడీఆర్3 ర్యామ్,

3జీ వయా డాంగిల్, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

8జీబి ఇన్-బుల్ట్ స్టోరేజ్,

32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

హెచ్‌డిఎమ్ఐ సపోర్ట్,

3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర రూ.6,499.

ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమయ్యాయి.

లింక్ అడ్రస్

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot