ఫాబ్లెట్ మార్కెట్లోకి కోబియన్!

Posted By: Staff

 ఫాబ్లెట్ మార్కెట్లోకి కోబియన్!

ఫాబ్లెట్ నిర్మాణంలోకి తాజాగా ప్రవేశించిన కంప్యూటర్ విడిభాగాలు తయారీబ్రాండ్ కోబియన్ తాజాగా ‘మెర్క్యురీ మ్యాజిక్’ పేరుతో సరికొత్త ఫాబ్లెట్‌ను ఆవిష్కరించింది. ఈ డివైజ్ దేశీయ మార్కెట్ ధర రూ.12,700. ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోబియన్ ఇండియా సంచాలకులు సుష్మితా దాస్ మాట్లాడుతూ తాము ప్రతిష్టాత్మకంగా రూపొందించిన టాబ్లెట్ కమ్

స్మార్ట్‌ఫోన్ ‘మెర్క్యురీ మ్యాజిక్’ ఆకర్షణీయమైన డిజైనింగ్‌ను కలిగి మన్నికతో కూడిన పనితీరును ప్రదర్శించగలదని ధీమా వ్యక్తం చేశారు.

స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్,

డ్యూయల్ సిమ్ సపోర్ట్,

ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,

4జీబి ఇన్‌బుల్ట్ మెమెరీ,

512ఎంబీ ర్యామ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు,

12 మెగాపిక్సల్ రేర్ కెమెరా,

ఫ్రంట్ కెమెరా,

3జీ, వై-ఫై, బ్లూటూత్,

బ్యాటరీ బ్యాకప్ (టాక్‌టైమ్ 13 గంటలు, స్టాండ్‌బై 15 రోజులు).

కోబియన్ ‘మ్యాజిక్ ఫాబ్లెట్’కు పోటీగా భావిస్తున్న ఫాబ్లెట్‌ల వివరాలు:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100:

ప్రముఖ దేవీ మొబైల్ తయారీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ చేసే డిజైన్ కాబడిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫాబ్లెట్ ‘కాన్వాస్ ఏ100’. స్ర్కీన్ పరిమాణం 5 అంగుళాలు (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్),

డ్యూయల్ కోర్ ప్రాసెసర్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటంగ్ సిస్టం, ఇంటర్నల్ మెమెరీ 4జీబి, ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ 32జీబి, 5 మెగా పిక్సల్ కెమెరా, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.9999.

స్పైస్ స్టెల్లార్ హారిజన్ ఎమ్ఐ500:

మార్కెట్లో ఈ మధ్యనే విడుదలైన ‘స్పెస్ స్టెల్లార్ హారిజన్ ఎమ్ఐ500’ అత్యాధునిక ఫీచర్లను ఒదిగి ఉంది. ఫీచర్లను పరిశీలిస్తే.... 5 అంగుళాల టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్

శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్, 5 మెగాపిక్సల్ రేర్ కెమెరా, .3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ సిమ్ సపోర్ట్, ధర రూ.11,999.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot