‘ఆమోజోన్’, ‘కోబో వోక్స్’ టాబ్లెట్ పీసీల జోరు!!

Posted By: Super

‘ఆమోజోన్’, ‘కోబో వోక్స్’ టాబ్లెట్ పీసీల జోరు!!

వాటాల కోసం దిగ్గజాల ఆట మొదలైంది.. అస్త్రాలు జోరు ఊపందుకుంది.. మార్కెట్లో ‘గ్రేడ్ -1’ స్థానాన్ని అధిరోహించటమే లక్ష్యంగా వ్యూహరచన సాగిస్తున్న గ్యాడ్జెట్ తయరీ సంస్థలు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగదారులకు మరింత చేరువుచేస్తున్నాయి.

అంతర్జాతీయ టాబ్లెట్ పీసీల మార్కెట్లో అమ్మకాల ద్వారా అత్యధిక వాటాను కైవసం చేసుకునేందుకు ప్రముఖ టాబ్లెట్ తయారీ సంస్థలు ‘ఆమోజోన్’ (Amazon), కోబో వోక్స్ (Kobo Vox)లు పోటి పడుతున్నాయి.

ఈ క్రమంలోనే యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో డిజైన్ చేసిన టాబ్లెట్ పీసీలను ఈ బ్రాండ్లు విడుదల చేయునున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్లు నేటి ఉరుకుల పరుగుల జీవితాలకు మరింత ఉపయుక్తంగా నిలుస్తాయని సంబంధిత వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత టాబ్లెట్ మార్కెట్లో ‘కాంపిటీషన్ క్రియోట్’ చేసిన ఈ హాట్ గ్యాడ్జెట్ల ఫీచర్లను క్లుప్తంగా పరిశీలిద్దాం,

స్క్రీన్ డిస్ ప్లే , రిసల్యూషన్ మరియు మెమరీ స్టోరేజ్ అంశాల్లో ఈ ఇరు టాబ్లెట్లు సమాన ప్రాతిపదికను కలిగి ఉన్నాయి. 7 అంగుళాల స్క్రీన్ డిస్ ప్లే, 1024 x 600 పిక్పల్ రిసల్యూషన్, 8జీబీ మెమరీ సామర్ధ్యాలను ఈ గ్యాడ్జెట్లలో పొందుపరిచారు.

బరువు అంశాలను పరిశీలిస్తే ‘ఆమోజోన్ కిండిల్ ఫైర్’ 413 గ్రాములు, ‘కోబో వోక్స్ టాబ్లెట్’ 403 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ అంశాలను చూస్తే ‘కిండిల్ ఫైర్’ 8 గంటలు, ‘వోక్స్ టాబ్లెట్’ 7 గంటల బ్యాకప్ సామర్ద్యాన్ని కలిగి ఉంటాయి.

ఆన్ లైన్ సపోర్టెడ్ బుక్ స్టోర్ వ్యవస్థను ఈ రెండు గ్యాడ్జెట్లలో ఏర్పాటు చేశారు. ‘కోబో వోక్స్’ టాబ్లెట్ పీసీలోని ప్రత్యేక ఫీచర్లను పరిశీలిస్తే ‘హై స్పీడ్ సిల్క్ బ్రౌజర్ వ్యవస్థ’ లావాదేవీల నిర్వహణకు వేగవంతంగా స్పందిస్తుంది.

కేవలం నలుపు రంగులో డిజైన్ కాబడని ‘ఆమోజోన్ కిండిల్ ఫైర్’ నవంబర్ 15న విడుదలయ్యేందుకు ముస్తాబవుతుంది. నలుపు, పింక్, గ్రీన్ రంగుల్లో డిజైన్ కాబడిన ‘కోబో వోక్స్’ టాబ్లెట్లు అక్టోబర్ 28న విడుదల కానున్నాయి. ఆధునిక ఫీచర్లో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్ల ధరలు రూ.10,000లోపు ఉండోచ్చని వ్యాపార వర్గాలు అంచనావేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot