లక్ష్మీ కొత్త ప్లాన్..?

Posted By: Super

లక్ష్మీ కొత్త ప్లాన్..?

 

భారతీయ కంపెనీ లక్ష్మీ యాక్సిక్ కమ్యూనికేషన్స్ సిస్టమ్స్ (ఎల్ఏసీఎస్), తాను రూపాందించిన మ్యాగ్నమ్ టాబ్లట్ పీసీల పై ధరలను 36 శాతానికి తగ్గించింది. దింతో సేల్స్ 25శాతానికి పెరిగే అవకాశముందని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ అంశం పై సంస్థ నేషనల్ సేల్స్‌హెడ్ వికాస్ ఆనంద్ స్పందిస్తూ, తాము తీసుకున్న ఈ నిర్ణయం అమ్మకపు శాతాన్ని పెంచేందుకు తోడ్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. లక్ష్మీ యాక్సిస్ కమ్యూనికేషన్స్ ఆరు నెలల క్రితం టాబ్లెట్ పీసీల తయారీ విభాగంలోకి ప్రవేశించింది. మ్యాగ్నమ్ బ్రాండ్‌నేమ్ కింద దాదాపు 6,000 యూనిట్‌లను విక్రయించినట్లు ఆనంద్ పేర్కొన్నారు.

మ్యాగ్నమ్ బ్రాండ్ కింద తాజాగా రెండు వేరియంట్‌లలో టాబ్లెట్ పీసీలను లక్ష్మీ లాంచ్ చేసింది. ట్యామరిండ్ బీ7, బీ10 మోడల్స్‌లో విడుదలైన ఈ పీసీలు ఉత్తమ క్వాలిటీ కంప్యూటింగ్‌ను అందిస్తాయి.

ట్యామరిండ్ బీ7 ప్రధాన ఫీచ్లరు:

7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్,

ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్,

ధర రూ. 11,499.

ట్యామరింగ్ బీ10 ప్రధాన ఫీచర్లు:

10 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్,

ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్,

ధర రూ.20,499.

వినియోగదారులకు మరింత చేరువయ్యే క్రమంలో దేశవ్యాప్తంగా 120 experience స్టోర్లను బ్రాండ్ నెలకొల్పింది. త్వరలో వీటి పరిధిని వెయ్యికు పెంచేందుకు సన్నాహాలు చేస్తుంది. ఔత్సాహికులు ఈ స్టోర్లను సందర్శించి కొనుగోళ్లతో పాటు తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. త్వరలోనే వైర్‌లెస్ మౌస్ అదేవిధంగా వైర్‌లెస్ కీబోర్డులను దేశవ్యాప్తంగా విడుదల చేసేందుకు లక్ష్మీ యాక్సిస్ కమ్యూనికేషన్స్ ఏర్పాట్లు చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot