ల్యాప్‌టాప్ కొంటున్నారా..?, ఈ 8 విషయాలు గుర్తుపెట్టుకోండి

Posted By:

ల్యాప్‌టాప్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకున్నారా..?, మీకు ఎటువంటి ల్యాప్‌టాప్ బెస్ట్..?, మీ అవసరానికి తగ్గట్టుగా ల్యాప్‌టాప్‌ను ఎంపిచేసుకునే మార్గాలను ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాం. మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..? అయితే మీరు ఎంపిక చేసుసుకున ల్యాపీ కోర్ ఐ3 ప్రాసెసర్‌ను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తమా.. అయితే కోర్ ఐ3 లేదా యూఎల్‌వీ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరు కోనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తమా..అయితే కోర్ఐ5 యూఎల్‌వీ లేదా కోర్ ఐ7 యూఎల్‌వీ సామర్ధ్యాలను కలిగిఉండాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపరేటింగ్ సిస్టం ఎంపిక

మ్యాక్, విండోస్ ఇంకా క్రోమ్ ఒఎస్ పై స్పందించే ల్యాప్‌టాప్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మ్యాక్ ఓఎస్‌ను యాపిల్ ఆపర్ చేస్తుండగా, విండోస్ ఆపరేటింగ్ సిస్టంను మైక్రోసాఫ్ట్, క్రోమ్ ఓఎస్‌ను గూగుల్ ఆఫర్ చేస్తోంది. మీ వినియోగం అలానే అభిరుచిన బట్టి నచ్చిన ఆపరేటింగ్ సిస్టంతో కూడిన ల్యాప్‌టాప్‌ను ఎంపిక చేసుకోండి.

 

ల్యాప్‌టాప్ సైజ్

13 నుంచి 14 అంగుళాలు, 15 అంగుళాలు, 17 నుంచి 18 అంగుళాలు స్ర్కీన్ సైజు వేరియంట్‌లలో ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మీ వినియోగాన్ని బట్టి సైజును ఎంపిక చేసుకోండి.

 

మీరు ఎంపిక చేసుకునే ల్యాప్‌టాప్‌కు సంబంధించి కీబోర్డ్ ఇంకా టచ్‌ప్యాడ్ పని తీరును చెక్ చేసుకోండి.

మీరు ఎంపిక చేసుకునే ల్యాప్‌టాప్‌కు సంబంధించి ప్రాసెసర్, ర్యామ్, హార్డ్‌డ్రైవ్, ఫ్లాష్ క్యాచీ, సాలీడ్ స్టేట్ డ్రైవ్, డిస్‌ప్లే రిసల్యూషన్, టచ్‌స్ర్కీన్, గ్రాఫిక్స్ చిప్, డీవీడీ/బ్లూ-రే డ్రైవ్ వంటి స్పెసిఫికేషన్‌లు మీ అవసరాలకు తగ్గట్టుగా ఉన్నాయో లేదా చెక్ చేసుకోండి.

మీరు ఎంపిక చేసుకునే ల్యాప్‌టాప్ మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉండాలి.

మీరు ఎంపిక చేసుకునే బ్రాండ్‌ను బట్టే ల్యాప్‌టాప్ పనితీరు ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ల్యాప్‌టాప్ ఎంపిక విషయంలో బ్రాండ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..? అయితే 15.6 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉండాలి. బరువు 2.5కిలోగ్రాములు అంతకన్నా తక్కువ. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తమా..? అయితే ల్యాపీ 14 అంగుళాల స్ర్కీన్ సైజును కలిగి ఉండాలి. బరువు 2కిలోగ్రాములు అంతకన్నా తక్కువ. మీరు కోనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తమా..? అయితే ల్యాపీ 13 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉండాలి. బరువు 1.7 కిలోగ్రాములు అంతకన్నా తక్కువ ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ మల్టీ మీడియా అవసరాల నిమిత్తమా.. ల్యాపీ 15.6 అంగుళాల అంతకన్నా పెద్ద స్ర్కీన్ హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో ఉండాలి. బరువు 2.7కిలోగ్రాములు ఉండాలి.

మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే 15.6 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉండాలి. బరువు 2.7కిలో గ్రాములు. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తం అయితే ధర రూ.30,000 నుంచి రూ.50,000 వరకు పెట్టొచ్చు. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తం అయితే ధర రూ.30,000 నుంచి రూ.55,000 వరకు పెట్టొచ్చు. మీరు కోనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తం అయితే ధర రూ.50,000 నుంచి రూ.లక్ష వరకు పెట్టొచ్చు. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌‌టాప్ మల్టీ మీడియా అవసరాల నిమిత్తం అయితే రూ.45,000 నుంచి రూ.లక్ష వరకు పెట్టొచ్చు. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే రూ.35,000 నుంచి రూ. లక్ష వరకు పెట్టొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Laptop Buying Guide: 8 Essential Tips. Read more in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot