సగం చూపించింది.. అంతా ఫ్లాట్!!

Posted By: Prashanth

సగం చూపించింది.. అంతా ఫ్లాట్!!

 

దేశీయ మొబైల్ విపణిలో అనేక రకాలైన మొబైల్‌ఫోన్‌లను విడుదల చేసిన లావాకు ఊహించిని స్థాయిలో స్పందన లభించింది. ఈ ఆదరణను మరింత పెంచుకునే క్రమంలో మరో అడుగు ముందుకేసిన లావా ఇంటెల్ కార్పొరేషన్‌తో జతకట్టి హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను వ్ళద్ధి చేసింది. ‘XOLO X900’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ హ్యాండ్‌సెట్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఆవిష్కరించనున్నారు. ఇంటెల్ ప్లాట్‌ఫామ్ ఆధారితంగా భారత్‌లో విడుదలవుతున్న తొలి స్మార్ట్‌ఫోన్ ‘లావా XOLO X900’. ఈ డివైజ్‌కు సంబంధించి పలు కీలక స్పెసిఫికేషన్‌లు వెలుగులోకి వచ్చాయి..

* 4.3 అంగుళాల హై రిసల్యూషన్ LCD డిస్‌ప్లే,

* ఇంటెల్ ఆటమ్ Z2460 ప్రాసెసర్, (క్లాక్ సామర్ధ్యం 1.6 GHz),

* ఉత్తమ క్వాలిటీ కెమెరా వ్యవస్థ,

* నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ) వ్యవస్థ,

* HSPA + నెట్‌వర్క్ సపోర్ట్,

* హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ,

* ఇంటెల్ XMM6260 ప్లాట్‌ఫామ్.

క్యాండీ బార్ ఆక్ళతిలో డిజైన్ కాబడిన ఈ ఫోన్ పూర్తి స్థాయి టచ్ సౌలభ్యతతో పనిచేస్తుంది. ఏర్పాటు చేసిన స్ర్కీన్ పెద్ద తెర అనుభూతిని కలిగిస్తుంది. ఫోన్ మరిన్ని ఫీచర్లు తెలియాల్సి ఉంది. మార్కెట్ ధర రూ.25,000 ఉండొచ్చని ఓ అంచనా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot