లావా నుంచి డ్యూయల్ సిమ్ 3జీ కాలింగ్ ట్యాబ్లెట్!

|

ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని లావా ఇంటర్నేషనల్ ‘ఇ-ట్యాబ్ ఐవోరీ' పేరుతో సిరకొత్త డ్యూయల్ సిమ్ 3జీ వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్ పీసీని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ 7అంగుళాల ట్యాబ్లెట్ ధర రూ.10,199. ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. ఈ డివైజ్‌లో ప్రత్యేకమైన హైడెఫినిషన్ గేమ్స్‌లోడ్ చేయటం జరిగింది.

 
లావా నుంచి డ్యూయల్ సిమ్ 3జీ కాలింగ్ ట్యాబ్లెట్!

లావా ఇ-ట్యాబ్ ఐవోరీ కీలక స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ (మీడియా టెక్), పవర్ వీఆర్ఎస్ఎక్స్531 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 4జీబి రోమ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. ట్యాబ్ కనెక్టువిటీ ఫీచర్లు: డ్యూయల్ 3జీ కనెక్టువిటీ వాయిస్ కాలింగ్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్. ప్రీలోడెడ్ అప్లికేషన్స్: ఓఎల్ఎక్స్, పే టీఎమ్, జీమెయిల్ , ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్స్ యాప్

పోటీగా ఇంటెక్స్ ఐబడ్డీ కనెక్ట్:

గత ఏప్రిల్‌లోనే ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఇంటెక్స్ ఐబడ్డీ కనెక్ట్, లావా ఇ-ట్యాబ్ ఐవోరీకి గట్టి పోటినివ్వనుంది.

ఇంటెక్స్ ఐబడ్డీ ప్రధాన ఫీచర్లను పరిశీలించినట్లయితే:

7 అంగుళాల డిస్ ప్లే, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ డ్యూయల్ సిమ్, వాయిస్ కాలింగ్, వై-ఫై కనెక్టువిటీ, 3500 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. ఇండియన్ మార్కెట్లో ఇంటెక్స్ ఐబడ్డీ కనెక్ట్ ధర రూ.9990.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X