అదిరే ఫీచర్లతో Lava Helium 12 ల్యాపీ, రూ.12,999కే
దేశీయ మొబైల్ దిగ్గజం లావా యూజర్ల కోసం సరికొత్త ల్యాపీ Lava Helium 12ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
దేశీయ మొబైల్ దిగ్గజం లావా యూజర్ల కోసం సరికొత్త ల్యాపీ Lava Helium 12ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2 జిబి ర్యామ్‌తో ఈ ల్యాప్‌టాప్ దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన స్టోర్లలో అందుబాటులోకి రానుంది. వీడియో కాలింగ్ ఫీచర్‌తో వస్తున్న ఈ ల్యాపీ వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. కంపెనీ దీని ధరను రూ.12,999గా నిర్ణయించింది.

Lava Helium 12 ఫీచర్లు
12.5 ఇంచ్ డిస్‌ప్లే, 1366 x 768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.88 గిగాహెడ్జ్ ఇంటెల్ ఆటం ప్రాసెసర్, 2 జీబీ DDR3 ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, వెబ్‌క్యామ్, వీడియో కాలింగ్, వైఫై, బ్లూటూత్ 4.0, విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్, 10000mAh battery, 1TB వరకు హార్డ్ డిస్క్‌ను పెంచుకునే సామర్ధ్యం


Click it and Unblock the Notifications








