లావా 3జీ కాలింగ్ ట్యాబ్లెట్@రూ.8,499
దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లావా ‘ఐవోరీ ఎస్'(IvoryS) పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.8,499. డ్యుయల్ సిమ్ వాయిస్ కాలింగ్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 3జీ వీడియోకాలింగ్ వంటి ప్రత్యేక అంశాలు ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌లో ఒదిగి ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మార్కెట్లతో పాటు ఆన్‌లైన్ రిటైలర్ల వద్ద ఈ డివైస్ లభ్యమవుతోంది. లావా ఐవోరీఎస్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3జీ వాయిస్ కాలింగ్ సామర్థ్యం,
7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1024x 600పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ మీడియాటెక్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ట్యాబ్లెట్ పరిమాణం191x108.5x9.8మిల్లీ మీటర్లు,
బరువు 300 గ్రాములు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications