లావా నుంచి సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్ ‘ఎక్స్‌ట్రాన్ జె704’

Posted By:

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లావా తన ఎక్స్‌ట్రాన్ టాబ్లెట్‌ల శ్రేణి నుంచి ‘ఎక్స్‌ట్రాన్ జెడ్704' పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ టాబ్లెట్‌ను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.6,499. లావా ఎక్స్‌ట్రాన్ జెడ్704 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...

రూ.6,499కే లావా ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ టాబ్లెట్

7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ 8127 ప్రాసెసర్, మాలీ 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా టాబ్లెట్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ ఎడ్జ్, వై-ఫై, బ్లూటూత్ 4.0, హెచ్‌డిఎమ్ఐ, జీపీఎస్).

3జీ కనెక్టువిటీ ఫీచర్ ఈ డివైస్‌లో లోపించింది. అదేవిధంగా ఎక్స్‌ట్రాన్ జె704 వాయిస్ కాలింగ్‌ను సపోర్ట్ చేస్తుందా లేదా అన్న అంశం పై లావా క్లారిటీ ఇవ్వవల్సి ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Lava Launches Xtron Z704 Tablet With Android KitKat at Rs 6,499. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot