జస్ట్... చేతులు ఊపితే చాలు!

Posted By: Super

జస్ట్... చేతులు ఊపితే చాలు!

 

కంప్యూటింగ్ ప్రపంచంలో చోటుచేసుకుంటున్న కొత్త కొత్త ఆవిష్కరణలు మానవుని శారీరక శ్రమతో పాటు, పని సమయాన్ని మరింత మితం చేస్తున్నాయి. తాజగా శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన లీప్ మోషన్ సంస్థ కొత్త ఒరవడికి నాంది పలుకుతూ లీప్ టెక్నాలజీ వెలుగులోకి తెచ్చింది. ఇక పై కంప్యూటర్ ముందు కూర్చుని ప్రతి అంశానికి మౌస్ ఇంకా కీబోర్డును ఉపయోగించాల్సిన అవసరం లేదు. డెస్క్‌టాప్ స్ర్కీన్ పై ఐటమ్‌లను మార్చాలన్నా... ముఖ్యమైన డేటాను లిఖించాలన్నా.... ఇష్టమైన గేమ్‌ను ఆడాలన్నా. కంప్యూటర్ ముందు కూర్చుని అందుకు అనుగుణంగా చేతులు కదిపితే చాలు, పని చిటెకలో ఫినిష్.

ప్రస్తుత మార్కెట్లో ఉన్న వర్ట్యుల్ గెస్ట్యర్ టెక్నాలజీతో పోలిస్తే ‘లీప్’ టెక్నాలజీ 200 శాతం కచ్చితత్వంతో పని చేస్తుందని రూపకర్తలు స్పష్టం చేస్తున్నారు. . లీప్ మన వద్ద ఉంటే.. మౌస్, కీబోర్టుకు గుడ్‌బై చెప్పేయొచ్చని పేర్కొంటున్నారు. ఫ్లాష్‌డ్రైవ్ సైజులో ఉండే ఈ లీప్ కంప్యూటర్‌కు అనుసంధానించి ఉంటుంది. భవిష్యత్తులో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, కార్లు, రిఫ్రిజరేటర్లలో ఈ టెక్నాలజీని ప్రవేశపెడతామని లీప్ మోషన్ తెలిపింది. ఈ లీప్ పరికరం వెల రూ.3,900. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తేనుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot