లెనోవో కొత్త లుక్?

Posted By: Staff

లెనోవో కొత్త లుక్?

టెక్నాలజీ మీడియా ప్రపంచం ‘ఫాబ్లెట్’ మంత్రాన్ని జపిస్తున్న రోజులివి. స్మార్ట్‌ఫోన్ అదేవిధంగా టాబ్లెట్ పీసీ లక్షణాలను తనలో ఒదిగించుకున్న ‘ఫాబ్లెట్’ ప్రస్తుమ గ్యాడ్జెట్ మార్కెట్లో హాట్ టాపిక్. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకని ప్రపంచపు రెండువ అతిపెద్ద పీసీ తయారీ సంస్థ లెనోవో (Lenovo) సరికొత్త ఫాబ్లెట్‌ను డిజైన్ చేసింది. పేరు ‘లీఫోన్ కె860’. మొదటిగా చైనాలో విడుదల కానున్న ఈ ఫాబ్లెట్ ఏడాది చివరినాటికి భారత్‌‌లో లభ్యమవుతుంది.

ఫీచర్లు (లెనోవో అధికారిక ప్రకటన ఆధారంగా):

5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),

ఆన్-స్ర్కీన్ బటన్స్,

ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

క్వాడ్‌కోర్ సామ్‌సంగ్ Exynos 4412 ప్రాసెసర్,

8 మెగాపిక్సల్ రేర్ కెమెరా,

2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

1జీబి ర్యామ్,

2250ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot