కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది!!

Posted By: Staff

కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది!!

 

ల్యాప్‌టాప్‌ల నిర్మాణ రంగంలో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న లెనోవో(Lenovo) ఓ బ్ళహత్తర ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. 9.7 అంగుళాల స్ర్కీన్ పరిమాణంలో  టాబ్లెట్  పీసీని విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు పూర్తి చేసింది. ఏప్రిల్ నాటికి అంతర్జాతీయంగా అందుబాటులోకి రానున్న ‘ఐడియా ప్యాడ్ ఎస్2109’ ఫీచర్ల పై స్పెషల్ ఫోకస్........

ఆండ్రాయిడ్ అత్యాధునిక ఆపరేటింగ్ సిస్టం 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్, డివైజ్‌కు పెద్ద ప్లస్ పాయింట్ గా భావించవచ్చు. యూజర్ ఫ్రెండ్లీ స్వభావం హెచ్చుగా ఉన్న ఈ డివైజ్ వినియోగదారుని అవసరాలను పూర్తి భరోసాతో తీరుస్తుంది. నిక్షిప్తం చేసిన డ్యూయల్ కోర్ ప్రాసెసర్  టాబ్లెట్ పనితీరును నిరంతరం సమీక్షిస్తూ ఏ విధమైన అంతరాయాలు వాటిల్లకుండా చూస్తుంది.

9.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే  పూర్తి స్థాయి టచ్ వ్యవస్ధను కలిగి మన్నికైన విజువల్స్‌ను  విడుదల చేస్తుంది.  టాబ్లెట్‌లో నిక్షిప్తం చేసిన వై-ఫై అప్లికేషన్,  నెట్ బ్రౌజింగ్ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. పీసీలో దోహదం చేసిన 4 శక్తివంతమైన ఎస్ఆర్ఎస్ రెడీ స్పీకర్లు ఆడియో క్వాలిటీని రెట్టింపు చేస్తుంది. ఇండియాతో పాటు యూఎస్, బ్రెజిల్, కెనడా, జర్మనీ, చిలీ, రష్యా, మెక్సికో, జపాన్ ప్రాంతాల్లో IdeaTab S2109 విడుదల కానుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot