లెనోవో 10 అంగుళాల కంప్యూటర్!!

కంప్యూటర్ల నిర్మాణ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లెనోవో(Lenovo)సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. 9.7 అంగుళాల స్ర్కీన్ పరిమాణంలో టాబ్లెట్ పీసీని ఈ బ్రాండ్ డిజైన్ చేసింది. ఏప్రిల్ నాటికి అంతర్జాతీయంగా అందుబాటులోకి రానున్న ఐడియా ప్యాడ్ ఎస్2109 ఫీచర్లు .....
ఆండ్రాయిడ్ అత్యాధునిక ఆపరేటింగ్ సిస్టం 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ పై డివైజ్ రన్ అవుతుంది. నిక్షిప్తం చేసిన డ్యూయల్ కోర్ ప్రాసెసర్ టాబ్లెట్ పనితీరును నిరంతరం సమీక్షిస్తూ అంతరాయాలు వాటిల్లకుండా చూస్తుంది.
9.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే పూర్తి స్థాయి టచ్ వ్యవస్ధను కలిగి మన్నికైన విజువల్స్‌ను విడుదల చేస్తుంది. టాబ్లెట్‌లో నిక్షిప్తం చేసిన వై-ఫై వ్యవస్థ ఇంటర్నెట్ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. పీసీలో దోహదం చేసిన 4 శక్తివంతమైన ఎస్ఆర్ఎస్ రెడీ స్పీకర్లు ఆడియో క్వాలిటీని రెట్టింపు చేస్తాయి. ఇండియాతో పాటు యూఎస్, బ్రెజిల్, కెనడా, జర్మనీ, చిలీ, రష్యా, మెక్సికో, జపాన్ ప్రాంతాల్లో IdeaTab S2109 విడుదల కానుంది.


Click it and Unblock the Notifications








