లెనోవో నుంచి మూడు సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు

Posted By:

చైనాకు చెందిన ప్రముఖ వ్యక్తిగత కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవో, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే మూడు సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీ మోడల్స్ ను మార్కెట్లో ఇటీవల ఆవిష్కరించింది. వాటి వివరాలు లెనోవో ఏ7, లెనోవో ఏ8, లెనోవో ఏ10గా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ వర్షన్ ప్లాట్‌ఫామ్ పై ఈ మూడు డివైస్‌లు స్పందిస్తాయి. మూడు భిన్నమైన ప్రాసెసర్‌ల పై ఈ ఫోన్‌లు రన్ అవుతాయి.

లెనోవో నుంచి మూడు సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు

ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ పీసీలకు 1280x800పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన ప్రత్యేకమైన ఐపీఎస్ డిస్‌ప్లే‌ను అమర్చారు. 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఈ డివైస్‌ల మెమెరీని విస్తరించుకోవచ్చు. 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

7 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో లభ్యమయ్యే లెనోవో ఏ7 ట్యాబ్లెట్ ఇండియన్ మార్కెట్ ధర రూ.8,500.ఇండియన్ మార్కెట్లో లెనోవో ఏ8 ధర అంచనా రూ.12,000, లెనోవో ఏ10 ధర అంచనా రూ.15,000.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot