లెనోవో ఐస్‌క్రీమ్ టాబ్లెట్..!!

Posted By: Prashanth

లెనోవో ఐస్‌క్రీమ్ టాబ్లెట్..!!

 

టాబ్లెట్ కంప్యూటర్‌ల సంస్కృతి రోజు రోజుకు విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ భారీ శ్రమలతో పాటు లఘు పరిశ్రమలు వీటి ఉత్పాదనలు పై దృష్టిసారిస్తున్నాయి. ఈ నేపధ్యంలో రోజుకో మోడల్ టాబ్లెట్ డివైజ్ పుట్టుకొస్తుంది. కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌ల సెగ్మంట్‌లో సాటిమేటిగా రాణిస్తున్న లెనోవో ‘ఐడియా ప్యాడ్ ఎస్2’ మోడల్‌లో ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీని విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసింది.

‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో’ వేదికగా ఈ గ్యాడ్జెట్‌ను ప్రదర్శించనున్నారు. ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ v4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైజ్ రన్ అవుతుంది. డిస్‌ప్లే 10 అంగుళాలు, మల్టీ టచ్ స్ర్కీన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. డివైజ్ మందం 7.6mm, బరువు 499 గ్రాములు. ల్యాప్‌టాప్ డాక్‌ను ఈ టాబ్లెట్‌లో ఏర్పాటు చేశారు. ఈ సౌలభ్యతతో టాబ్లెట్‌కు 20 గంటల అదనపు బ్యాటరీ లైఫ్ అందుతుంది. శక్తివంతమైన డ్యూయర్ కోర్ ప్రాసెసర్‌ను ఈ పీసీలో నిక్షిప్తం చేశారు

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot