ఆంధ్రా, తెలంగాణ వాసులకు కంప్యూటర్ లోన్‌లు : లెనోవో

Posted By:

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వినియోగదారులకు కంప్యూటర్ల కొనుగోలుకు సంబంధించి వడ్డీలేని రుణంతో పాటు ఆ రుణాన్ని నెలవారీ వాయిదాల పద్ధతిలో చెల్లించే కొత్త పథకాన్ని లెనోవో గురువారం ప్రవేశపెట్టింది. ఐటీ రంగానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు కీలకంగా ఉన్నప్పటికి ఇక్కడ కంప్యూటర్ల వాడకంలో వృద్థి రేటు తక్కువుగా ఉందని, దీన్ని ప్రోత్సహించేందుకే కంప్యూటర్ల కొనుగోలు పై రుణ సదుపాయాన్ని ప్రవేశపెడుతున్నట్లు లెనోవో ఇండియా డైరెక్టర్ (మార్కెటింగ్) భాస్కర్ చౌధురి తెలిపారు.

 వడ్డీ లేని కంప్యూటర్ లోన్‌లు: లెనోవో

రెండు రాష్ట్రాల్లోని వినియోగదారులకు రుణ సదుపాయాన్ని అందించేందకు లెనోవో హెచ్‌డీఎఫ్‌సీ సహా 11 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రుణ పథకం ద్వారా కంప్యూటర్‌లను కొనుగోలు చేసిన వారికి ఉచితంగా ఇంటర్నెట్ డాంగిల్స్ సమకూర్చేందుకు ప్రధాన టెలికాం కంపెనీలతో కూడా లెనోవో చర్చలు జరుపుతోంది.

లెనోవో అందిస్తోన్న రుణ స్కీమ్ ద్వారా నోట్‌బుక్, ల్యాప్‌టాప్ ఇంకా అన్ని ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్ మోడళ్లను కొనుగులు చేయవచ్చు. వీటికి అయ్యే మొత్తాన్ని లెనోవో రుణంగా అందిస్తుంది. ముందుగా ఎటువంటి మొత్తం చెల్లించాల్సి అవసరం ఉండదు. వడ్డీ ఉండదు. నెలవారి వాయిదా పద్ధతి (ఈమ్ఐ) ద్వారా రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రూ.22,390 నుంచి రుణ మంజూరు శ్రేణి ప్రారంభమవుతుంది.

తొలత క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్న వారికి ఈ రుణాలను మంజూరు చేస్తారు. నవంబర్ మధ్య నుంచి రెండు రాష్ట్రాల్లోని అన్ని లెనోవో విక్రయశాలల్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Lenovo announces computer loans. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot