అంతిమంగా.. ఆ రోజు రానే వచ్చింది?

Posted By: Prashanth

అంతిమంగా.. ఆ రోజు రానే వచ్చింది?

 

ఆత్రుతతో ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. గ్యాడ్జెట్ ప్రియులు ఉత్కంఠకు తెరదింపుతూ లెనోవో తన సరికొత్ల ల్యాప్‌టాప్ ‘ధింక్ ప్యాడ్ X1 కార్బన్’కు సంబంధించి కీలక వివరాలను బహిర్గతం చేసింది. ఈ కంప్యూటింగ్ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన ఉత్తమ క్వాలిటీ ఫీచర్లు అదేవిధంగా స్పెసిఫికేషన్‌లు మెరుగైన పనితీరును కనబరుస్తాయనటంలో ఏమాత్రం సందేహం లేదు.

ధింక్ ప్యాడ్ X1 కార్బన్ కీలక ఫీచర్లు:

14 అంగుళాల స్ర్కీన్ డిస్ ప్లే,

రిసల్యూషన్ 1600 x 900పిక్సల్స్,

3జీ కనెక్టువిటీ,

స్పిల్ రెసిస్టెండ్ కీబోర్డ్,

శక్తివంతమైన ఐవీ బ్రిడ్జ్ ప్రాసెసర్,

ఇంటెల్ వీప్రో మేనేజిమెంట్ టెక్నాలజీ,

రాపిడ్ చార్జ్ టెక్నాలజీ.

ల్యాపీ బరువు 3పౌండ్లు,

మందం 18మిల్లీమీటర్లు.

ఈ ల్యాపీ సమర్ధవంతమైన ఐవీ బ్రిడ్జ్ ప్రాసెసర్‌తో బలోపేతమవటంతో పనితీరు వేగంగా ఉంటుంది. హై రిసల్యూషన్ కలిగిన 14 అంగుళాల స్ర్కీన్ ఉత్తమమైన వీక్షణ అనుభూతులను చేరువచేస్తుంది. ఏర్పాటు చేసిన స్పిల్ రెసిస్టెంట్ కీబోర్డ్ సౌకర్యవంతమైన టైపింగ్‌కు దోహదపడుతుంది. 3జీ కనెక్టువిటీ నెట్‌బ్రౌజింగ్ సామర్ద్యాన్ని రెట్టింపు చేస్తుంది. రాపిడ్ ఛార్జ్ టెక్నాలజీ సౌలభ్యతతో ల్యాపీని కేవలం అరగంట వ్యవధిలో 80శాతం ఛార్జ్ చేసుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న ధింక్‌ప్యాడ్ X1 కార్బన్ ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

లెనోవో 10 అంగుళాల కంప్యూటర్!!

కంప్యూటర్ల నిర్మాణ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లెనోవో(Lenovo)సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. 9.7 అంగుళాల స్ర్కీన్ పరిమాణంలో టాబ్లెట్ పీసీని ఈ బ్రాండ్ డిజైన్ చేసింది. ఐడియా ప్యాడ్ ఎస్2109 ఫీచర్లు …

ఆండ్రాయిడ్ అత్యాధునిక ఆపరేటింగ్ సిస్టం 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ పై డివైజ్ రన్ అవుతుంది. నిక్షిప్తం చేసిన డ్యూయల్ కోర్ ప్రాసెసర్ టాబ్లెట్ పనితీరును నిరంతరం సమీక్షిస్తూ అంతరాయాలు వాటిల్లకుండా చూస్తుంది.9.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే పూర్తి స్థాయి టచ్ వ్యవస్ధను కలిగి మన్నికైన విజువల్స్‌ను విడుదల చేస్తుంది. టాబ్లెట్‌లో నిక్షిప్తం చేసిన వై-ఫై వ్యవస్థ ఇంటర్నెట్ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. పీసీలో దోహదం చేసిన 4 శక్తివంతమైన ఎస్ఆర్ఎస్ రెడీ స్పీకర్లు ఆడియో క్వాలిటీని రెట్టింపు చేస్తాయి. ఇండియాతో పాటు యూఎస్, బ్రెజిల్, కెనడా, జర్మనీ, చిలీ, రష్యా, మెక్సికో, జపాన్ ప్రాంతాల్లో IdeaTab S2109 విడుదల కానుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot